సీఎం కేసీఆర్ పై జస్టిస్ చంద్రు కీలక వ్యాఖ్యలు..

-

మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రముఖ న్యాయవాది, మద్రాస్ హైకోర్ట్ మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రు. సూర్య నటించిన జై భీమ్ సినిమా తరువాత తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం అయ్యారు చంద్రు. దళిత మహిళ పట్ల పోరాడిన చంద్రు నిజ జీవితం ఆధారంగానే జై భీమ్ సినిమాను తెరకెక్కించారు. అయితే ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ హైకోర్ట్ పై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షం, జగన్ సర్కార్ పై ప్రజల్లో కన్నా… కోర్టుల్లో ఎక్కువగా పోరాడుతోందని చంద్రు కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలపై హైకోర్ట్  కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది.

తాజాగా మరో తెలుగు రాష్ట్రం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు జస్టిస్ చంద్రు. ప్రజలకు వ్యతిరేఖంగా మాట్లాడితే ఎక్కవ రోజులు అధికారంలో ఉండలేమని అన్నారు. గతంలో ఆర్టీసీ ఉద్యోగులు చేసిన సమ్మె విషయంలో కేసీఆర్ నిర్ణయం విస్మయానికి గురిచేసిందని అన్నారు. యూనియన్లతో కాకుండా కార్మికులతో మాట్లాడుతా అనడం సరికాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇదే విధంగా నీటి హక్కులపై వ్యతిరేఖంగా వెళితే ఆయన  అధికారానికే ప్రమాదమని హెచ్చరించారు చంద్రు.

Read more RELATED
Recommended to you

Exit mobile version