Breaking : మునుగోడులో నామినేషన్‌ వేసిన కేఏ పాల్

-

నల్గొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నికలో ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిగా అధ్యక్షుడు కేఏ పాల్ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్లు దాఖలుకు చివరి రోజున ఆయన అనూహ్యంగా బరిలో దిగుతున్నట్లు ప్రకటించారు. వాస్తవానికి మునుగోడులో ప్రజా శాంతి పార్టీ తరఫున ప్రజా కవి గద్దర్ పోటీ చేస్తారని కొద్ది రోజుల క్రితం కేఏ పాల్ ప్రకటించారు. అయితే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కేఏ పాల్ ఆఫీసుకు వద్దకు వెళ్లిన గద్దర్ కార్యాలయం లోపలికి వెళ్లకుండానే వెనుదిరిగారు. ఈ ఘటన అనేక అనుమానాలు రేకెత్తించింది. ఈ అంశంపై స్పందించిన కేఏ పాల్ గద్దర్ కు ఎలాంటి అసంతృప్తి లేదని.. ఆయన నామినేషన్ వేస్తారని స్పష్టం చేశారు. శుక్రవారం నామినేషన్ వేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.

KA PAUL CHALLENGES CM KCR AND CM JAGAN | KA PAUL PRESS MEET : కేసీఆర్,  జగన్‌లకు పాల్ సవాల్ News in Telugu

అయితే గద్దర్ నామినేషన్ వేయకుండా పోలీసులు అడ్డుకోవడంతో ప్రజా శాంతి పార్టీ తరఫున తానే నామినేషన్ దాఖలు చేస్తున్నట్లు కేఏ పాల్ ప్రకటించారు. అధికార టీఆర్ఎస్ పార్టీతో పాటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మునుగోడులో విచ్చలవిడిగా డబ్బు పంచుతున్నాయని, కేవలం నామినేషన్ ప్రక్రియ కోసమే ప్రధాన పార్టీలు రూ.100 నుంచి 200 కోట్ల వరకు ఖర్చు చేశాయని కేఏ పాల్ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు కేఏ పాల్. ఉప ఎన్నికలో డబ్బు ఆశ చూపుతూ జనాన్ని ప్రలోభాలకు గురి చేస్తున్నారని అందులో పేర్కొన్నారు కేఏ పాల్. ఒక్కో ఓటుకు సగటున రూ. 30 వేల నుంచి రూ.3 లక్షల వరకు ఖర్చు చేస్తున్నందున ఎన్నిక స్వేచ్ఛయుతంగా జరిగే పరిస్థితి కనిపించడం లేదని పాల్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని.. ఓటర్ల జాబితాలో కూడా అక్రమాలు జరుగుతున్నందున ఉప ఎన్నికను వాయిదా వేయాలని ఎన్నికల కమిషన్ ను లిఖితపూర్వకంగా కేఏ పాల్ కోరారు.

 

Read more RELATED
Recommended to you

Latest news