కేఏ పాల్‌కు షాక్‌.. మునుగోడు తన నామినేషన్‌ తిరస్కరణ.. కానీ బరిలో

-

మునుగోడు ఉప ఎన్నికకు నిన్న నామినేషన్ల ప్రక్రియ ముగిసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ నేప‌థ్యంలో ఉప ఎన్నిక‌లో పోటీ చేసేందుకు ఆయా పార్టీలు, వ్య‌క్తులు దాఖ‌లు చేసిన నామినేష‌న్ల‌ను శ‌నివారం ప‌రిశీలించారు అధికారులు. ఇందులో భాగంగా నిబంధ‌న‌లకు అనుగుణంగా లేని నామినేష‌న్ల‌ను అధికారులు తిర‌స్క‌రించారు అధికారులు. ఇలా తిర‌స్క‌ర‌ణ‌కు గురైన నామినేష‌న్ల‌లో ప్ర‌జాశాంతి పార్టీ అధ్య‌క్షుడి హోదాలో కేఏ పాల్ దాఖ‌లు చేసిన నామినేష‌న్ కూడా ఉంది. అయినా కూడా కేఏ పాల్ ఎన్నిక‌ల బ‌రిలో ఉన్న‌ట్లు అధికారులు శ‌నివారం సాయంత్రం ప్ర‌క‌టించారు. నామినేష‌న్ల దాఖ‌లుకు చివ‌రి రోజైన శుక్ర‌వారం కేఏ పాల్ రెండు సెట్ల నామినేష‌న్లు దాఖ‌లు చేశారు.

- Advertisement -

K.A. Paul Biography – Childhood & Life History

ఓ నామినేష‌న్‌ను ప్ర‌జాశాంతి పార్టీ అధ్యక్షుడి హోదాలో దాఖ‌లు చేయ‌గా… మ‌రో నామినేష‌న్‌ను ఇండిపెండెంట్ అభ్య‌ర్థిగా దాఖ‌లు చేశారు. జాశాంతి పార్టీని గుర్తింపు లేని పార్టీగా ఇటీవ‌లే కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌క‌టించిన సంగతి తెలిసిందే. దీంతో ప్ర‌జాశాంతి పార్టీ అధ్యక్షుడి హోదాలో దాఖలు చేసిన నామినేష‌న్‌ను తిర‌స్క‌రించిన అధికారులు.. ఇండిపెండెంట్ హోదాలో దాఖ‌లు చేసిన నామినేష‌న్‌ను మాత్రం అనుమ‌తించారు. ఫ‌లితంగా ప్ర‌జాశాంతి పార్టీ అభ్య‌ర్థిగా కాకుండా స్వతంత్ర అభ్య‌ర్థిగా కేఏ పాల్ బ‌రిలో ఉన్న‌ట్లు ప్ర‌క‌టించారు అధికారులు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...