అసిస్టెంట్ డైరెక్టర్స్‌కు ఊహించని బహుమతులిచ్చిన కమల్ హాసన్..

-

లోకనాయకుడు కమల్ హాసన్ ప్రస్తుతం ‘విక్రమ్’ ఫిల్మ్ సక్సెస్ ను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమా విజయం సాధించిన సంతోషంలో ఒక్కొక్కరికి బహుమతులు ఇస్తూ వారిని మరింత సంతోష పెడుతున్నారు. ఇప్పటికే దర్శకుడు లోకేశ్ కనకరాజ్ కు లగ్జరీ కారును గిఫ్ట్ గా ఇచ్చారు.

‘రోలెక్స్’ అనే గెస్ట్ రోల్ ప్లే చేసిన సూర్యకు రోలెక్స్ వాచ్ ను తాజాగా గిఫ్ట్ గా ఇచ్చారు. ఈ క్రమంలోనే ‘విక్రమ్’ చిత్రానికి పని చేసిన 13 మంది అసిస్టెంట్ డైరెక్టర్స్ కు కమల్ హాసన్ ఊహించని బహుమతులు ఇచ్చారు.

అపాచీ ఆర్‌టీఆర్‌ 160 బైక్‌లను బహుమతిగా ఇచ్చాడు. ఈ ఒక్కో బైక్‌ ధర సుమారుగా రూ. 1.45 లక్షలు ఉంటుందని తెలుస్తోంది. ‘విక్రమ్‌’ మూవీ కోసం వీరు చాలా హర్డ్‌ వర్క్‌ చేశారని, వారి శ్రమ ఫలితమే మూవీ బాగా వచ్చిందని కమల్‌ ఈ సందర్భంగా చెప్పారు. అసిస్టెంట్‌ డైరెక్టర్లకు కమల్‌ బైక్‌ కీ అందిస్తున్న ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ చిత్ర సీక్వెల్ గురించి క్రేజీ డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఈ పిక్చర్ రూ.200 కోట్లు కలెక్ట్ చేసినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news