బోధన్‌లో కమలం హవా..షకీల్ హ్యాట్రిక్ మిస్?

-

వరుసగా రెండుసార్లు గెలిచిన ఎమ్మెల్యేలకు మూడోసారి గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని ఇటీవల పీకే టీం సర్వే టీఆర్ఎస్ అధిష్టానానికి రిపోర్ట్ ఇచ్చిందని కథనాలు వస్తున్న విషయం తెలిసిందే. 2014, 2018 ఎన్నికల్లో వరుసగా గెలిచిన ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత కాస్త ఎక్కువగానే ఉందని, వారికి మళ్ళీ సీట్లు ఇస్తే గెలవడం కష్టమని సర్వేలో తేలింది.

ఈ లిస్ట్ లో బోధన్ ఎమ్మెల్యే మహమ్మద్ షకీల్ కూడా ఉన్నారని కథనాలు వస్తున్నాయి. ఈయన వరుసగా రెండుసార్లు బోధన్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే మూడోసారి ఈయనకు గెలుపు అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని సర్వేలు చెబుతున్నాయి. అసలు గతంలో బోధన్ లో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు మంచి పట్టు ఉండేది. 1983 నుంచి 1994 వరకు బోధన్ లో వరుసగా టీడీపీ గెలిచింది. 1999 నుంచి 2009 వరకు వరుసగా కాంగ్రెస్ గెలిచింది. కాంగ్రెస్ తరుపున సుదర్శన్ రెడ్డి గెలుస్తూ వచ్చారు.

2014, 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచింది…టీఆర్ఎస్ నుంచి షకీల్ గెలుస్తూ వచ్చారు…రెండు సార్లు గెలిచి అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నా సరే…బోధన్ లో జరిగే అభివృద్ధి తక్కువే..అలాగే ప్రజల్లో ఉండటం, ప్రజా సమస్యలు పరిష్కరించడంలో కూడా షకీల్ వెనుకబడి ఉన్నారని తెలుస్తోంది. అలాగే ఆ మధ్య ఈయన..బీజేపీ ఎంపీ అరవింద్ తో భేటీ అయ్యి సంచలనం సృష్టించారు…దీంతో ఆయన బీజేపీలోకి వెళ్లిపోతారని ప్రచారం జరిగింది. కానీ వెంటనే బీజేపీలోకి వెళ్ళే ప్రసక్తి లేదని తేల్చి చెప్పేశారు.

అలా టీఆర్ఎస్ లో పనిచేస్తూ వస్తున్న షకీల్ కు గాని…నెక్స్ట్ బోధన్ టికెట్ దక్కితే…మళ్ళీ గెలిచే ఛాన్స్ ఏ మాత్రం లేదని సర్వేల్లో తేలింది. ఈ సారి బోధన్ సీటు బీజేపీ ఖాతాలో పడే ఛాన్స్ ఉందని సర్వేలు చెబుతున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ బలం కూడా తగ్గిందని తెలుస్తోంది. మొత్తానికి బోధన్ లో షకీల్ కు హ్యాట్రిక్ కొట్టే ఛాన్స్ దక్కేలా లేదు..

Read more RELATED
Recommended to you

Latest news