ఆగని వకీల్ సాబ్ రచ్చ..’కామారెడ్డి’లో థియేటర్ ధ్వంసం !

-

కామారెడ్డిలోని శాంతి థియేటర్ లో పవన్ ఫ్యాన్స్ వీరంగం సృష్టించారు. థియేటర్ మీద దాదాపు యాభై మంది యువకులు దాడి చేసినట్టు సమాచారం. ఆందోళనకారులు థియేటర్ ప్రొజెక్టర్ మీద బాటిల్ కూడా విసిరినట్టు సమాచారం. సీట్లు కూడా ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది, దీంతో ఒక అరగంట పాటు సినిమా నిలిపివేసినట్లు సమాచారం. అయితే ఎందుకు ఫ్యాన్స్ ఇంతలా రెచ్చిపోయారు అనేది మాత్రం తెలియాల్సి ఉంది. నిన్న తిరుపతిలోని శాంతి థియేటర్లపై రాళ్లు రువ్వడం ఉద్రిక్తతకు దారితీసింది.

అలాగే కడప జిల్లా బద్వేల్‌లో పవన్ ఫ్యాన్స్ బీభత్సం సృష్టించారు. అత్యుత్సాహంతో థియేటర్‌లోని కుర్చీలు విరగ్గొట్టి రచ్చ చేశారు. దీంతో థియేటర్, అభిమానుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏపీలో బెనిఫిట్ షో, ప్రత్యేక షోలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంపై ఫ్యాన్స్ రెచ్చిపోయారు. కానీ తెలంగాణలో ఉన్న ఈ థియటర్ మీద ఎందుకు దాడి చేశారు ? అనే అంశం మాత్రం తెలియాల్సి ఉంది. 

Read more RELATED
Recommended to you

Exit mobile version