ఇండియా వేదికగా అక్టోబర్ నెలలో వన్ డే వరల్డ్ కప్ జరగనుంది.. ఇప్పటికే పూర్తి షెడ్యూల్ ను కూడా ప్రకటించేసింది ఐసీసీ. కాగా ఈ వరల్డ్ కప్ పైన ఇండియా అభిమానులకు మరియు మాజీ ఇండియా క్రికెటర్లకు చాలా హోప్స్ ఉన్నాయి. తాజాగా వరల్డ్ కప్ ను మొదటిసారి ఇండియాకు అందించిన కపిల్ దేవ్ వరల్డ్ కప్ గురించి మాట్లాడుతూ సెలక్షన్ కమిటీకి కీలకమైన సూచనలు చేశారు. కపిల్ దేవ్ సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతూ … ప్రస్తుతం వరల్డ్ కప్ కు సెలెక్ట్ చేసే ముందుగానే ప్రతి ఒక్క అతగాడి ఫిటినెస్ లెవెల్స్ ను పరీక్షించాలి. ఇందుకు సరైన ప్లాట్ ఫామ్ ఆసియా కప్ అని చెప్పారు. ఈ ఆసియా కప్ లో కీలక ఆటగాళ్లు అందరినీ ఆడించి వారి ఫిట్నెస్ ను గమనించాలి. చిన్న గాయం ఉన్నా లేదా ఫిట్ గా లేకుండా వరల్డ్ కప్ కు సెలెక్ట్ చేయకపోవడం మంచిదంటూ సలహా ఇచ్చారు కపిల్ దేవ్.
వరల్డ్ కప్ కు వారిని సెలెక్ట్ చేయద్దు : కపిల్ దేవ్
-