కేసీఆర్ బిగ్ ట్విస్ట్..ముగ్గురు మంత్రులు అవుట్.?

-

ఎన్నికలకు సమయం దగ్గరపడిపోతుంది..ఎవరికి వారు ఎన్నికల హడావిడిలో ఉన్నారు..సరిగా చూసుకుంటే మళ్ళీ 11 నెలల్లో తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే 2023 డిసెంబర్‌లో ఎన్నికలు జరుగుతాయి. అలా కాకుండా కేసీఆర్ గాని ముందస్తు ఎన్నికలకు ప్లాన్ చేస్తే..జూన్ లేదా జూలై ఎన్నికలు జరుగుతాయి. మరి కేసీఆర్ ముందస్తుకు వెళ్తారా లేదా అనేది ఇప్పుడే క్లారిటీ వచ్చే అవకాశం మాత్రం కనిపించడం లేదు.

ప్రస్తుతం ఆయన బీఆర్ఎస్ పార్టీ విస్తరణ పనుల్లో ఉన్నారు.జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే దిశగా ముందుకెళుతున్నారు. ముందు ఏపీలో కూడా పార్టీనీ విస్తరించాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు ఎలాగో వేరు వేరుగా జరుగుతాయి..కాబట్టి ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలపైనే ఎక్కువ ఫోకస్ పెట్టే ఛాన్స్ ఉంది. మళ్ళీ గెలవడమే టార్గెట్ గా పెట్టుకున్నారు. అయితే ఎన్నికల సమయం దగ్గరపడుతున్న క్రమంలో కేసీఆర్ పెద్ద ట్విస్ట్ ఇస్తారని తెలుస్తోంది. అది కూడా క్యాబినెట్ విస్తరణపై ఫోకస్ చేశారని తెలిసింది.

క్యాబినెట్‌లో ముగ్గురు మంత్రులని మార్చి…కొత్తవారిని తీసుకుంటారని కథనాలు వస్తున్నాయి. అయితే ఇవి కథనాలు మాత్రమే. ఇందులో వాస్తవం ఎంత ఉందనేది మాత్రం క్లారిటీ లేదు. పైగా బీఆర్ఎస్ శ్రేణులు సైతం క్యాబినెట్ విస్తరణ గురించి మాట్లాడటం లేదు. కానీ సరిగ్గా పనిచేయని ముగ్గురుని పక్కన పెట్టి..కొత్తవారిని క్యాబినెట్ లో తీసుకుంటారని ప్రచారం వస్తుంది.

అది కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇద్దరు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక మంత్రిని తప్పిస్తారని కథనాలు వస్తున్నాయి. అలాగే హరీష్ రావు ఆర్ధిక శాఖతో పాటు ఆరోగ్య శాఖని చూసుకుంటున్నారు.  దీని వల్ల హరీష్‌కు పని భారం పెరిగింది..అందుకే ఇందులో ఆరోగ్య శాఖని వేరే వారికి అప్పగిస్తారని కూడా ప్రచారం వస్తుంది. కానీ ఎన్నికల సమయం దగ్గరపడటంతో కేసీఆర్ మంత్రి వర్గ విస్తరణ చేస్తారా లేదా అనేది చెప్పలేం.

Read more RELATED
Recommended to you

Exit mobile version