FIR మూవీపై కేసీఆర్‌ సర్కార్‌ సీరియస్‌..కీలక ఆదేశాలు జారీ !

-

ఎఫ్ఐఆర్ మూవీ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా ఇవాళ విడుదల అయింది. అయితే సినిమా పోస్టర్ పై మత గ్రంథాని కి చెందిన వ్యాఖ్యలు ఉన్నాయంటూ ఆందోళన చేపట్టడం ఉద్రిక్తతకు దారి తీసింది. ముస్లిం మతానికి చెందిన మత గ్రంథం లోని వ్యాఖ్యలు సినిమా పోస్టర్ పై ప్రచురించడం పై నిన్న వికారాబాద్ జిల్లా తాండూరులో ఆందోళన చేపట్టారు కొంతమంది ముస్లిం యువకులు. ఇక తాజాగా ఈ వివాదంపై కేసీఆర్‌ సర్కార్‌కు ఎంఐఎం ఫిర్యాదు చేసింది.

ముస్లీం ల మనోభావాలను దెబ్బతీసే విధంగా FIR తెలుగు సినిమా పోస్టర్ లో హీరో మొఖం పై ముద్రించిన అరబిక్ పదాల (షహదాల) ను వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని MIM MLA లు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కోరారు.

శుక్రవారం మంత్రి శ్రీనివాస్ యాదవ్ ను ఆదర్శ నగర్ లోని MLA క్వార్టర్స్ లోని తన కార్యాలయంలో నాంపల్లి, యాకత్ పురా, కార్వాన్ MLA లు జాఫర్ హుస్సేన్ మెరాజ్, సయ్యద్. అహ్మద్ పాషా ఖాద్రి, కౌసర్ మొహినోద్దీన్ లు కలిసి ఈ మేరకు వినతి పత్రాన్ని అందజేశారు. వెంటనే స్పందించిన మంత్రి FDC ED కిషోర్ బాబు తో ఫోన్ లో మాట్లాడి వెంటనే FIR సినిమా ప్రతినిధులతో మాట్లాడి అరబిక్ పదాలను తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news