పెన్షన్స్ పై ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు

-

గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో వయసు మళ్ళిన ఎవరికైతే పెన్షన్ ఇస్తున్నారో దాంట్లో కొంత మంది అనేక ఇబ్బందులు ఎదురుకోవాల్సి వస్తుందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. వాళ్ళ వయసు 65 నుండి 70 సంవత్సరలు ఉంటే అదార్ కార్డు లో మాత్రం 55, లేదా 60 లోపు గా ఉన్నాయన్నారు. ఎందుకంటే ఈ వయసు వారి దగ్గర బర్త్ సర్టిఫికెట్ లేకపోవడం ప్రధాన కారణం అన్నారు.

jaggareddy | జగ్గారెడ్డి

దింతో అందాదగా వారి వయసు అద్దార్ కార్డు లో వేయడం వల్ల ఇలా రాష్ట్రంలో అనేక మంది పెన్షన్ లబ్ధిదారులు పెన్షన్ కోల్పోతున్నారని అన్నారు. ప్రభుత్వం వెంటనే దీని పై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీఆర్ఏ లను ఇంటింటికి పంపించి ఆ ఇంట్లో వయసు మీరిన వారిని అడిగి వారి అధార్ కార్డు లో డేట్ మార్చాలన్నారు. ఇలా చేస్తే చాలా మంది ముసలితనం లో ఉన్న వారు, ఆర్ధిక ఇబ్బంది పడుతున్న వారికి లాభం చేకూరుతుందన్నారు. దీన్ని కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలని సూచించారు.

ఎన్నికల మేనిఫెస్టో లో అందరికి పెన్షన్ 3016 రూపాయలు ఇస్తామన్నారని.. కానీ ఇప్పుడు 2016 రూపాయలే ఇస్తున్నారని అన్నారు. 3016 రూపాయల పెన్షన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. 57 ఏళ్ల వారికి కూడా 3016 రూపాయల పెన్షన్ అమల్లోకి తీసుకురావాలన్నారు. ప్రతి మున్సిపాలిటీ లో ని వార్డు లో, గ్రామంలో గ్రామ సభలు ఏర్పాటు చేసి అద్దార్ కార్డు లో వయసు తక్కువ, తప్పుగా వచ్చినవారికి ప్రభుత్వమే సవరణ చేసే లా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version