ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఫైబర్ నెట్ కేసు లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఫైబర్ నెట్ కేసు లో కీలక వ్యక్తి సాంబ శివరావు అరెస్ట్ అయ్యారు. తెలుగు దేశం పార్టీ అధికారం లో ఉన్న సమయం లో ఇన్ఫా స్రాక్చర్ కార్పొరేషన్ ఎండీ గా ఈ సాంబ శివరావు పని చేశారు. కేంద్రం నుంచి డిప్యుటేషన్ పై ఆంధ్ర ప్రదేశ్ లో పని చేశారు సాంబ శివరావు.
ఇప్పటికే సాంబ శివరావు తో పాటు హరి ప్రసాద్ ను ప్రశ్నించారు సీఐడీ అధికారులు. అయితే.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఫైబర్ నెట్ కేసు లో సాంబ శివరావు అవినీతికి పాల్పడినట్లు… కొన్ని ఆధారాలు సీఐడీ కి లభ్యమైనట్లు సమాచారం అందుతోంది. ఈ నేపథ్యం లోనే సాంబ శివరావు ను పోలీసులు అరెస్ట్ చేశారు. సాంబ శివరావు ను అరెస్ట్ చేసిన.. అధికారులు… విచారణ అనంతరం… కోర్టు ముందు ఉంచే అవకాశం ఉంది. అలాగే.. మరి కొంత మందిని ఈ కేసులో సీఐడీ అధికారులు అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది.