కేబినెట్ సబ్ కమిటీ భేటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.త్వరలో మరో రెండు గ్యారంటీలు అమలు చేద్దామని వారితో చెప్పారు.డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు,ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి సచివాలయంలో సమావేశమయ్యారు. కేంద్ర కేబినెట్ సబ్ కమిటీతో కలిసి అరు గ్యారంటీలపై సీఎం రివ్యూ నిర్వహించారు.
రూ.500కే సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్ల గ్యారంటీల అమలుకు కార్యాచరణ సిద్ధం చేయాలని ఆయన సూచించారు.ఈ మూడు గ్యారంటీల అమలుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ,వీటిలో రెండింటిని తక్షణమే అమలు చేసేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఒక్కో గ్యారంటీ అమలుకు ఎంత ఖర్చవుతుంది.. ఎంత మందికి లబ్ధి కలుగుతుందని వాటికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ బడ్జెట్లో నిధులు కేటాయించాలని ఆర్థిక శాఖను ఆయన ఆదేశించారు. అసెంబ్లీ సమావేశాల్లోపు మరోసారి కేబినెట్ సమావేశం నిర్వహించి తుది నిర్ణయం తీసుకుందామన్నారు.