తీవ్ర అస్వస్థకు గురైన ఖుష్బూ.. ఆస్పత్రికి తరలింపు..!!

-

ప్రముఖ సినీనటి.. రాష్ట్ర బిజెపి మహిళ నేత ఖుష్బూ సుందర్ చేసిన ఒక ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారుతుంది . ఆస్పత్రి బెడ్ మీద నీరసంగా.. చేతికి సెలైన్ పెట్టుకున్న ఫోటోని ఆమె తన ట్విట్టర్లో షేర్ చేసింది. ఇక ఈ ఫోటో చూసిన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే దసరాకు లేటుగా శుభాకాంక్షలు తెలుపుతున్నందుకు క్షమించమని కూడా కోరింది. ఇది చూసిన నెటిజన్స్ ఖుష్బూ కు ఏమైంది అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే గత కొంతకాలంగా ఈమె బరువు తగ్గే ప్రయత్నంలో ఉన్న విషయం తెలిసిందే. అంతే కాదు గణనీయంగా బరువు కూడా తగ్గిపోయారు. ఉన్నట్టుండి బరువు తగ్గడమే ఎఫెక్ట్ అయిందో తెలియదు కానీ తరచూ అనారోగ్యం పాలవుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈమె ఆసుపత్రిలో చేరిన ఒక ఫోటో ప్రస్తుతం అందరిని ఆందోళన కలిగిస్తోంది.

ఇకపోతే ఖుష్బూ తన ట్విట్టర్లో… వెన్నెముక సమస్య కారణంగా ఆసుపత్రిలో చేరాను.. ఇప్పుడే ఇంటికి వచ్చాను.. ఒకటి రెండు రోజుల్లో కోలుకొని మళ్ళీ.. రోజూ వారి విధుల్లో పాలుపంచుకుంటాను. లేటుగా శుభాకాంక్షలు తెలుపుతున్నందుకు క్షమించండి.. అందరికీ దసరా శుభాకాంక్షలు అని ట్వీట్ చేసింది. అంతేకాదు ఆమె ఆసుపత్రి బెడ్ మీద ఉన్న ఫోటోని కూడా షేర్ చేశారు. ఇకపోతే రెండు రోజుల వరకు ఆరోగ్యంగా ఉన్న ఖుష్బూ మంగళవారం కూడా తన సోదరుడు అబ్దుల్లా నటించిన సినిమా ఆడియో రిలీజ్ వేడుకలలో కూడా పాల్గొనింది. సాయంత్రానికి తీవ్ర అస్వస్థకు గురయ్యారు. ఈ క్రమంలోనే నగరంలోని అపోలో ఆసుపత్రిలో చేర్చారు.

ప్రస్తుతం ఆమె ఆరోగ్యం కుదుటపడి.. డిస్చార్జ్ అయి ఇంటికి చేరుకున్నారు.. ఇకపోతే ఈమె ట్వీట్ చేయగానే అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్వరగా కోలుకోండి.. ఆరోగ్యం పై శ్రద్ధ తీసుకోండి అంటూ కామెంట్ చేస్తూ ఉండడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Exit mobile version