Kiara Sidharth Malhotra : వివాహ బంధంలోకి అడుగుపెట్టిన లవ్ బర్డ్స్ కియారా- సిద్ధార్థ్‌

-

బాలీవుడ్‌ లవ్ బర్డ్స్ కియారా అడ్వాణీ- సిద్ధార్థ్‌ మల్హోత్రాలు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కుటుంబ సభ్యులు, కొద్దిమంది అతిథుల సమక్షంలో వారి వివాహం మంగళవారం ఘనంగా జరిగింది. జైసల్మేర్‌ (రాజస్థాన్‌)లోని సూర్యఘర్‌ ప్యాలస్‌ వేడుకకు వేదికైంది.

ఈ వేడుకకు కరణ్‌ జోహార్‌, షాహిద్‌ కపూర్‌, జూహీ చావ్లా వంటి బీ టౌన్ సెలబ్రిటీలు హాజరయ్యారు. ప్రీ వెడ్డింగ్‌ ఫంక్షన్స్‌ ఈ నెల 5, 6న జరిగాయి. హిందూ సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ విహహ వేడుకలో పలు దేశాలకు చెందిన వంటలను రుచి చూపించారని బాలీవుడ్‌ వర్గాల సమాచారం. అతిథులు ఫొటోలు/వీడియోలు తీయకుండా కియారా- అడ్వాణీ తగిన చర్యలు తీసుకున్నారట. సినీ తారల కోసం ముంబయిలో త్వరలోనే ప్రత్యేకంగా మరో రిసెప్షన్‌ నిర్వహించనున్నారని సమాచారం.

‘షేర్షా’ సినిమాతో ఆన్‌స్క్రీన్‌ హిట్‌ పెయిర్‌గా నిలిచిన సిద్ధార్థ్‌-కియారా ఆ సినిమా షూటింగ్ సమయంలోనే ప్రేమలో పడ్డారని టాక్. వీరి పెళ్లి ఫొటోలు చూసి ఫ్యాన్స్‌ తెగ సంబుర పడిపోతున్నారు. మరోవైపు సెలబ్రిటీలు ఈ కొత్తజంటకు సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version