జాతీయ పార్టీలో ఉంటేనే రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది : కిరణ్ కుమార్ రెడ్డి

-

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఇటీవల బీజేపీ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. అయితే.. ఆయన తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. జాతీయ పార్టీలో ఉంటేనే రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని అన్నారు. ప్రజా జీవితంలో ఉండాలా… వద్దా అని ఇన్ని రోజులు ఆలోచించినట్లు చెప్పారు కిరణ్ కుమార్ రెడ్డి. చివరకు జాతీయ పార్టీ ద్వారానే న్యాయం జరుగుతుందని భావించానన్నారు.

Former Andhra Pradesh CM Kiran Kumar Reddy joins BJP : The Tribune India

తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రూ.7400 కోట్లతో చిత్తూరు జిల్లాకు మంచి నీటి పథకం ప్రణాళికను చేశానని గుర్తు చేశారు. ఒక్క జిల్లాకు అంత పెద్ద మొత్తం ఎలా ఇస్తారని నాడు హరీశ్ రావు తనతో గొడవ పడ్డారన్నారు కిరణ్ కుమార్ రెడ్డి. కానీ ఆ తర్వాత ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు ఆ మంచినీటి పథకాన్ని పక్కన పెట్టాయన్నారు. ప్రభుత్వాలు మారినప్పుడు ప్రాంతీయ పార్టీలు ఇలా పనులు ఆపివేయడం సరైనది కాదన్నారు. ప్రాంతీయ పార్టీలు ఖజనా నింపుకోవడంపై దృష్టి సారిస్తాయన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే బీజేపీ అధికారంలోకి రావాలన్నారు కిరణ్ కుమార్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news