అత్యంత ధనికులు ఉన్న నగరాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. నైట్ ఫ్రాంక్ నివేదికలో వెల్లడి

-

దేశంలో బిలియనీర్ల సంఖ్య పెరుగుతోంది. ప్రపంచంలోనే అత్యధిక బిలియనీర్లు ఉన్న దేశాల జాబితాలో ఇండియా మూడో స్థానంలో నిలిచింది. 748 బిలియనీర్లతో అమెరికా మొదటిస్థానంలో ఉండగా… 554 బిలియనీర్లలో చైనా రెండోస్థానంలో, 145 బిలియనీర్లతో ఇండియా మూడో స్థానంలో ఉందని నైట్ ఫ్రాంక్ వెల్త్ రిపోర్ట్ 2022 వెల్లడించింది.

ఇదిలా ఉంటే దేశంలో అత్యధిక ధనవంతులు ఉన్న నగరాల్లో హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది. ముంబై మొదటి స్థానంలో ఉంది. 2021లో నికర ఆస్తి రూ.227 కోట్ల కంటే ఎక్కువగా ఉన్నవారిని ధనికులుగా పేర్కొన్నట్లు నివేదిక వెల్లడించింది. ముంబైలో ధనవంతుల సంఖ్య 1596 ఉండగా.. హైదరాబాద్లో 467 మంది ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. తర్వాతి స్థానాల్లో పుణేలో 360, బెంగళూర్ లో 352 మంది, కోల్ కతాలో 257, ఢిల్లీలో 210, చెన్నైలో 160 మంది, అహ్మదాబాద్ 121 మంది ధనికులు ఉన్నట్లుగా నివేదిక వెళ్లడించింది. భారతీయ నగరాల్లో బెంగళూర్ హైఎస్ట్ గా ధనికుల సంఖ్య పెరిగిందని నివేదిక తెలియజేసింది. దాదాపుగా 17.1 గ్రోత్ రేట్ ను సాధించింది బెంగళూరు.

Read more RELATED
Recommended to you

Latest news