శృంగారం: మీ జీవితంలో రొమాన్స్ ఉందా? మీ భాగస్వామితో రొమాంటిక్ గా ఉంటున్నారా? ఇలా తెలుసుకోండి.

-

భార్యభర్తల బంధమైనా, సహజీవనంలో అయినా ఇద్దరు అపోజిట్ సెక్స్ మధ్య ఉండాల్సింది ప్రేమ అనుకుంటారు చాలామంది. ప్రేమ కావాలి. నిజమే. కానీ అదొక్కటి మాత్రమే సరిపోదు. జీవితంలో కొంచెం రొమాన్స్ ఉండాలి. అది అవతలి వారికి తెలియాలి. ఒక్కసారైనా నువ్వు రొమాంటిక్ అని అవతలి వారు అనేలా చేయాలి. అలాంటప్పుడే వారి జీవితంలో ఆనందం ఉందని అర్థం అవుతుంది.

మీ జీవితంలో రొమాన్స్ ఉందా? అసలు రొమాన్స్ అంటే ఏమిటో మీకు తెలుసా? రొమాంటిక్ పర్సన్స్ ఎలా ఉంటారో గమనించారా? మీ భాగస్వామి మీకు రొమాంటిక్ గా కనిపించారా? పై విషయాలు మీకు అర్థం కాకపోతే మీ జీవితంలో ఆనంద క్షణాలను కోల్పోతున్నట్టే.

రొమాన్స్ అనేది మీ ఇద్దరికీ సంబంధించినది. అవతలి వారిని గుర్తించడం. రొమాన్స్ అంటే ప్రేమ ప్రకటన. చాలామంది ప్రేమిస్తారు. కానీ దాన్ని ప్రకటించడంలో ఫెయిల్ అవుతారు. మీరెంత రొమాంటిక్ గా చెబుతున్నారనేది మీ ఆలోచనల మీద ఆధారపడి ఉంటుంది.

రొమాన్స్ అనేది అవతలి వారు మీకెంత ముఖ్యమో తెలియజేస్తుంది. వివాహమై ఎన్నో రోజులవుతున్నా కూడా అవతలి వారి కోసం కొన్నింటిని వదులుకోవడానికి సిద్ధపడుతున్నారన్న విషయాలు వారికి తెలియడం. అవతలి వారికి నచ్చని దాన్ని వదులుకుని, నువ్వంటే నాకిష్టం అని తెలిసేలా చేయడం.

అందరూ వేరు నువ్వు ప్రత్యేకం అన్న భావన అవతలి వారిలో కలిగించడం. నా గుండెల్లో నువ్వెప్పటికీ ఉంటావన్న ఆలోచనను సరిగ్గా చెప్పగల్గడం. వీటికోసం చాలా పనులు చేయాల్సి రావచ్చు. అలా చేయడంలోనూ ఆనందాన్ని పొందడమే రొమాన్స్ అంటే.

Read more RELATED
Recommended to you

Exit mobile version