దమ్ము, ధైర్యం ఉంటే ఆ పని చేయాలి.. టీడీపీ నేతలకు కొడాలి నాని సవాల్‌

-

చికోటీ ప్రవీణ్‌ క్యాసినో వ్యవహారం నేపథ్యంలో మరోసారి గుడివాడ క్యాసినో విషయాన్ని తెరపైకి తీసుకువచ్చారు టీడీపీ నేతలు. ఈ నేపథ్యంలో.. స్పందించిన కొడాలి నాని.. గుడివాడలో తాను క్యాసినో నిర్వహించినట్టు ఆధారాలు ఉంటే ఈడీకి చూపించి తనను అరెస్ట్ చేయించాలని టీడీపీ నేతలకు సవాల్ చేశారు. వారికి ఏమాత్రం దమ్ము, ధైర్యం ఉన్నా ఆ పని చేయాలని అన్నారు కొడాలి నాని. పట్టణంలో నిన్న నిర్వహించిన ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అనంతరం విలేకరులతో మాట్లాడారు. చికోటి క్యాసినో వ్యవహారాన్ని తనపైనా, ముఖ్యమంత్రి జగన్‌పైనా రుద్దేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కొడాలి నాని.

Kodali Nani Turns A Big Headache For Andhra CM Jagan

వారికి దమ్ముంటే తనను అరెస్ట్ చేయించాలన్నారు. దేశంలో ఏం జరిగినా చంద్రబాబు భజన బృందం తమకు ముడిపెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, విదేశాల్లో క్యాసినో వ్యవహారం బయటపడిన నేపథ్యంలో దీనికి సూత్రధారిగా భావిస్తున్న చికోటి ప్రవీణ్, మాధవరెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై ఈడీ అధికారులు దాడిచేసి సోదాలు నిర్వహించారు ‘పెద్దలు’ జూదం ఆడేందుకు విదేశీ పర్యటనలు ఏర్పాటు చేయడమే కాకుండా హవాలా, మనీలాండరింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలపై విచారణకు హాజరుకావాలంటూ ఈడీ వారికి నోటీసులిచ్చింది.

 

Read more RELATED
Recommended to you

Latest news