కేసీఆర్‌.. ఆ రోజే నీ పతనం మొదలైయింది : రాజగోపాల్‌రెడ్డి

-

తెలంగాణలో ప్రస్తుతం మునుగోడు మేనియా నడుస్తోంది. రాష్ట్ర ప్రజలు ఈ ఉప ఎన్నికలో ఎవరు గెలుస్తారని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘కేసీఆర్.. తెలంగాణ పోరాటంలో అన్నీ తానై ఉద్యమించిన ఈటల రాజేందర్​ను ఏనాడైతే అవమానించి పంపించావో ఆ రోజే నీ పతనం మొదలైయింది. ఉద్యమకారులను వదిలేసి గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్ కుమార్ లాంటి ఉద్యమ ద్రోహులను పక్కనపెట్టుకున్నావ్’ అని మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి​ ఫైర్ అయ్యారు. శుక్రవారం రాత్రి నాంపల్లి మండల కేంద్రంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్​షాను చూస్తే కేసీఆర్​కు వణుకు పుడుతోందన్నారు. అందుకే తనను ఒక్కడిని ఓడించేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసి 100 మంది వచ్చారని ఎద్దేవా చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తానని కేసీఆర్ మాయమాటలు చెప్పి మోసం చేశారని, రాష్ట్రంలో పేదల బతుకుల్లో ఎలాంటి మార్పు రాలేదన్నారు. అందుకోసమే ఈ ధర్మయుద్ధంలో మునుగోడు ప్రజలు తనతో కలిసిరావాలని కోరారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.

Rajagopal Reddy remains uncertain over shifting to BJP

మునుగోడు నియోజకవర్గ అభివృద్ధికి సీఎం కేసీఆర్ సహకరించనందుకే.. నిరసనగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మీ ముందుకు వచ్చానని రాజగోపాల్​రెడ్డి అన్నారు. ఇప్పుడు జరిగే ఉప ఎన్నిక తెలంగాణ భవిష్యత్తును మార్చే ఎన్నిక అని, వెయ్యి మంది బలిదానంతో తెచ్చుకున్న తెలంగాణ కేవలం కేసీఆర్ కుటుం బం కోసమేనా? అని ప్రశ్నించారు రాజగోపాల్​రెడ్డి. ఎనిమిదేండ్లలో పేదల బతుకులు మారలేదని, ఎవరికీ ఉద్యోగాలు రాలేదని అన్నారు. ఎవరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు రాలేదని, ఉచిత విద్య అమలు కాలేదని అన్నారు రాజగోపాల్​రెడ్డి. అసెంబ్లీ సాక్షిగా ఎన్నోసార్లు మునుగోడు సమస్యలపై తాను మాట్లాడినా సీఎం కేసీఆర్ పట్టించుకోలేదని మండిపడ్డారు. జిల్లా మంత్రికి కల్యాణ లక్ష్మి చెక్కులు పంచడం తప్పితే అభివృద్ధి పనులు చేయడం తెలియదన్నారు రాజగోపాల్​రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news