Big Breaking : పీసీసీ కమిటీపై అసంతృప్తితో కొండా సురేఖ రాజీనామా

-

తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త కమిటీలు కల్లోలం రేపాయి. నిన్న రిలీజ్ చేసిన లిస్ట్ లో తన జూనియర్ల కంటే తనకు తక్కువ స్థానం కల్పించారని కొండా సురేఖ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కొండా సురేఖకు ఎగ్జిక్యూటివ్ కమిటీలో స్థానం కల్పించారు. అయితే, పొలిటికల్ అఫైర్స్ కమిటీకి తనను ఎంపిక చేయకపోవడం పట్ల కొండా సురేఖ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన కంటే జూనియర్లకు పొలిటికల్ అఫైర్స్ కమిటీలో స్థానం కల్పించారని ఆమె ఆరోపించారు. ఇది తనను తీవ్రంగా అవమానించడమేనని పేర్కొన్నారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఓసారి మంత్రిగా పనిచేశానని, తన భర్త కొండా మురళి ఎమ్మెల్సీగా చేశారని, తమ కుటుంబానికి రాష్ట్రంలో ఎంతో పేరుందని అన్నారు.

Konda Surekha's condition for Huzurabad by-poll! - Konda Surekha

కానీ, తనను ఎగ్జిక్యూటివ్ కమిటీలో వేయడం బాధించిందని కొండా సురేఖ వాపోయారు. ఎమ్మెల్యేలుగా కూడా గెలవని వారు ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఉన్నారని, తనను కూడా వారితో పాటే పరిగణించడం అసంతృప్తి కలిగించిందని అన్నారు. తన సీనియారిటీని తగ్గించి ఆ కమిటీలో వేశారని, అందుకే పీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని వివరించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news