Koratala Siva: ‘ఆచార్య’లో కాజల్ అగర్వాల్ పాత్రపై స్పష్టతనిచ్చిన కొరటాల శివ

-

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఆచార్య’. ఈ నెల 29న సినిమా విడుదల కానుంది. టైటిల్ రోల్ మెగాస్టార్ చిరంజీవి ప్లే చేస్తు్న్నారు. ఆయనకు జోడీగా పంచదార బొమ్మ కాజల్ అగర్వాల్ నటించారు. కాగా, ట్రైలర్‌లో కాని సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కాని కాజల్ అగర్వాల్ పాత్ర గురించి పెద్దగా మాట్లాడలేదు.

ఈ క్రమంలోనే కాజల్ అగర్వాల్ రోల్ ప్రయారిటీపైన సోషల్ మీడియాలో వార్తలొస్తు్న్నాయి. హీరోయిన్ కాజల్ ను ట్రైలర్ లో ఎందుకు చూపించలేదని అభిమానులు ప్రశ్నలు కూడా వేశారు. కాగా, తాజాగా ఈ ప్రశ్నలన్నిటికీ దర్శకులు కొరటాల శివ సమాధానమిచ్చారు. కాజల్ అగర్వాల్ పాత్ర పై క్లారిటీనిచ్చారు.

‘ఆచార్య’ సినిమాలో ‘లాహే లాహే’ అనే సాంగ్ అమ్మ వారి మీద వచ్చే పాటని, ఇది ఒక ట్రూప్ వచ్చి ధర్మస్థలిలో చెప్పే పాటగా ఉంటుందన్నారు. ఇందులో కాజల్ అగర్వాల్ కనిపిస్తుంది. అయితే, చిత్రంలో ఆమెకు, ‘ఆచార్య’కు మధ్య లవ్ ఇంట్రెస్ట్ ఉంటుందని, ఇది ఫస్ట్ షెడ్యూల్ లో షూట్ కూడా చేశామని చెప్పిన కొరటాల..ఎందుకో అది సరి కాదని అనిపించిందని వివరించాడు. ఈ విషయమై తాను చిరంజీవి, కాజల్ అగర్వాల్ కు చెప్పానని అన్నాడు. అలా వారు ఓకే చెప్పారని అన్నాడు.

అలా ‘ఆచార్య’ చిత్రంలో కాజల్ అగర్వాల్ పాత్ర పెద్దగా ఉండబోదని క్లారిటీనిచ్చారు. అయితే, పాటలో కనిపించే అవకాశాలు అయితే ఉన్నట్లున్నాయి. ఇక ఇందులో రియల్ మీరో సోనుసూద్ కూడా వెరీ డిఫరెంట్ రోల్ ప్లే చేసినట్లు తెలిపారు. ట్రైలర్ లో చూస్తుంటే సోనుసూద్ చాలా డిఫరెంట్ గా కనబడుతారని వివరించారు కొరటాల శివ.

 

Read more RELATED
Recommended to you

Latest news