కిషన్ రెడ్డి ఒక పనికి మాలిన మంత్రి …బండి సంజయ్ ఒక దౌర్భాగ్యుడు… కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

-

ధాన్యం కొనుగోలపై కేంద్ర, బీజేపీ ప్రభుత్వ తీరుపై ఫైర్ అయ్యారు మంత్రి కేటీఆర్. ధాన్యం కొనుగోలు లక్షలాది మంది రైతులకు సంబంధించిన సమస్య అని ఆయన అన్నారు. యాసంగి పంట కోతకు వచ్చిన సందర్భంలో మంత్రుల బృందం కేంద్రం దగ్గరికి పలుమార్లు వెళ్ళారని..పీయూష్ గోయల్ ను కలసి ఆహార భద్రత చట్టం కింద ధాన్యం కొనుగోలు చేయాలని విన్నవించామని వెల్లడించారు. బాయిల్డ్ రైస్ ,రా రైస్ అంటూ మాట్లాడవద్దని…నిబంధనలు వద్దని పీయూష్ గోయల్ కు 10 సార్లు చెప్పామని… కేంద్రంలో మూర్ఖపు ప్రభుత్వం ఉందని అర్థం అయిందని ఆయన విమర్శించారు. గత యాసంగిలోనే వడ్లు కొనబోమని మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పారని… అయినా బీజేపీ బండి సంజయ్ వడ్లు వేయండి.. ప్రతీ గింజ కొనే బాధ్యత మాది అని చెప్పారని విమర్శించారు. వడ్లు వేయాలని రైతులను రెచ్చగొట్టారని మండి పడ్డారు. 

బండి సంజయ్ మానసిక స్థితిపై కేటీఆర్ అనుమానాలు వ్యక్తం చేశారు. మరోవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా భారత ప్రభుత్వం ప్రతి గింజ కొంటుందని చెప్పారు.. అయితే ఢిల్లీ బీజేపీ కరెక్టా.. సిల్లీ బీజేపీ కరెక్టా అని ప్రశ్నించారు. లోకల్ బిజెపి నాయకులకు తల తోక లేదని విమర్శించారు. కిషన్ రెడ్డి ఒక పనికి మాలిన మంత్రి …బండి సంజయ్ ఒక దౌర్భాగ్యడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ది కండకావరం అని… బీజేపీ నేతల అంతు చూస్తాం అని వార్నింగ్ ఇచ్చారు.

 

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version