మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించిన మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా కోస్గి సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కొడంగల్ ప్రజలు తంతే ఒక నాయకుడు మల్కాజిగిరిలో పడ్డాడు అని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి విమర్శించారు. ఆయనది ఐరన్ లెగ్, తెలుగుదేశం ను నాశనం చేశాడు. ఇప్పుడు కాంగ్రెస్ ను నాశనం చేయబోతున్నాడు అని అన్నారు.
మాటల మనుషులు కావాలా.. చేతల మనుషులు కావాలా. ఐరన్ లెగ్ కావాలా.. గోల్డెన్ లెగ్ కావాలా అని అన్నారు. పెద్దోల్లను తిడితే పెద్దమనుషులము కాము పనిచేసి పెద్ద మనుషులు కావాలి అని అన్నారు. ఒకడేమో కులపిచ్చి ఉన్న నాయకుడు ఉన్నాడు, మరొకరేమో మతపిచ్చి ఉన్న నాయకుడు ఉన్నాడు జాగ్రత్త అన్నారు కేటీఆర్. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి చేయని వారు మళ్ళీ వచ్చి మాకు అవకాశం ఇవ్వండి అని అడగడం ఆశ్చర్యానికి గురి చేస్తోందన్నారు.