మోదీకి ‘నోబెల్ ప్రైజ్’.. ఏ కేటగిరీలో ఇస్తే బెటర్..? : కేటీఆర్

-

ప్రధాన మంత్రి మోదీపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమ శాఖల మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. తాజాగా మోదీకి నోబెల్ బహుమతి ఇవ్వడంపై కేటీఆర్ ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తప్పక.. నోబెల్ బహుమతికి అర్హులే. కానీ ఏ కేటగిరీలో మోదీకి నోబెల్ ప్రైజ్ ఇస్తే బాగుంటుంది అంటూ కేటీఆర్ ట్విటర్ వేదికగా ప్రశ్నించారు. ఆ కేటగిరీలను కూడా ట్వీట్ చేశారు.

వైద్య, ఆర్థిక, శాంతి, భౌతిక శాస్త్ర రంగాల్లో మోదీకి నోబెల్ బహుమతికి అర్హులు ఎందుకు కారాదంటూ కేటీఆర్ ప్రశ్నించారు. కొవిడ్ వ్యాక్సిన్ కొనుగోలు చేయడంలో వైద్యరంగంలో నోబెల్ కు మోదీ ఇవ్వకూడాదా అంటూ ప్రశ్నించిన కేటీఆర్.. నోట్ల రద్దు, స్విస్ బ్యాంకు నుంచి మనీ రిటర్న్స్ కు గాను ఆర్థిక శాస్త్రంలో నోబెల్ ఇవ్వాలన్నారు. అలాగే 6 గంటల్లో రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధాన్ని ఆపినందుకు శాంతి బహుమతి ఇవ్వాలన్నారు. రాడార్ సిద్ధాంతానికిగాను భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతికి మోదీ అర్హుడంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version