రేవంత్ – బండిలతో కేటీఆర్ ‘స్టేట్ ఫైట్’..!

-

కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళిపోయి తెలంగాణ సీఎంగా కేటీఆర్‌ని పెడతారని ఎప్పటినుంచో తెలంగాణ రాజకీయాల్లో ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే రెండోసారి గెలిచి అధికారంలోకి వచ్చాక తెలంగాణలో ఈ ప్రచారం ఎక్కువ వచ్చింది..అలాగే పలు సందర్భాల్లో కూడా టీఆర్ఎస్ నేతలు సైతం..కేటీఆర్ సీఎం అవుతారని చెప్పుకొచ్చారు. కానీ ఇంతవరకు అది అమలు కాలేదు. వచ్చే ఎన్నికల్లో మాత్రం ఈ ప్రాసెస్ అమలు అవుతుందని టీఆర్ఎస్ వర్గాల్లో జోరుగా ప్రచారం నడుస్తోంది.

అటు ప్రతిపక్షాలు సైతం ఇదే మాట చెబుతున్నాయి..ఇక అందుకు తగ్గట్టుగానే తెలంగాణలో రాజకీయాలు కూడా నడుస్తున్నాయి. ఇటీవల కేసీఆర్ కేంద్ర రాజకీయాలపై ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే…కేంద్రంలోని బీజేపీని టార్గెట్ చేసుకుని ఆయన దూకుడుగా ముందుకెళుతున్నారు..బీజేపీ యాంటీ పార్టీలని ఒకటి చేసి మోడీ సర్కార్‌ని గద్దె దించాలని కేసీఆర్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. అంటే నెక్స్ట్ ఎన్నికల్లో కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తారని అర్ధమవుతుంది.

అదే సమయంలో రాష్ట్రంలో పార్టీ బాధ్యత పూర్తిగా కేటీఆర్ మీద పెడతారని తెలుస్తోంది. అందుకే ఇప్పుడు కేటీఆర్ కూడా రాష్ట్ర స్థాయిలో ఫోకస్ చేసి పనిచేస్తున్నారు..అభివృద్ధి కార్యక్రమాల పేరుతో కేటీఆర్..రాష్ట్రం మొత్తం తిరిగేస్తున్న విషయం తెలిసిందే. అలాగే కేటీఆర్..టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌లు టార్గెట్‌గా రాజకీయం చేస్తున్నారు. అంటే కేసీఆర్ సెంట్రల్ రాజకీయాలపై దృష్టి పెడితే, కేటీఆర్ స్టేట్ రాజకీయాలపై దృష్టి పెట్టారు.

అసలు కేసీఆర్‌ లేకపోతే టీబీజేపీ, టీపీసీసీ పదవులు వచ్చేవా? అని ప్రశ్నిస్తున్నా కేటీఆర్…అవి కేసీఆర్‌ పెట్టిన భిక్ష అని, రేవంత్‌రెడ్డి హౌలా.. బండి సంజయ్‌ దివాలా అంటూ కేటీఆర్ రాజకీయంగా విమర్శలు చేయడంలో కూడా దూకుడు ప్రదర్శిస్తున్న. ఇలా కేటీఆర్ పూర్తిగా స్టేట్ ఫైట్‌కు దిగేసి…రేవంత్, బండి టార్గెట్‌గా రాజకీయం స్టార్ట్ చేశారు. మరి స్టేట్ ఫైట్‌లో ఏ మేర సక్సెస్ అవుతారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news