Acharya: డ్యాన్స్‌లో ఆ గ్రేస్ ఏంటి బాసు..‘ఆచార్య’ నుంచి మరో అప్‌డేట్

-

‘ఆచార్య’ చిత్రం ఈ నెల 29న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మేకర్స్ పిక్చర్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఒక్కొక్కటిగా అప్ డేట్స్ ఇస్తూనే ఉన్నారు. ‘లాహే లాహే, నీలాంబరి, భలే భలే’ సాంగ్స్ విడుదల చేసిన మేకర్స్..ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. తాజాగా ‘లాహే లాహే’ సాంగ్ మరో వీడియో విడుదల చేశారు.

ఇక ఆ వీడియోలో చిరంజీవి గ్రేస్ ఫుల్ స్టెప్స్ చూడటానికి రెండు కళ్లు చాలవని చెప్పొచ్చు. సంగీతతో కలిసి చిరంజీవి స్టెప్పులేసిన వీడియో చూసి మెగా అభిమానులు బాస్ ఈజ్ బ్యాక్ అని అంటున్నారు. రీ ఎంట్రీ తర్వాత చిరంజీవి చేస్తున్న బెస్ట్ మూవీ ‘ఆచార్య’ నే అని అంటున్నారు. ఇందులో రామ్ చరణ్ ‘సిద్ధ’ గా కనిపించనుండగా, ‘ఆచార్య’గా చిరంజీవి అలరించనున్నారు.

ఇక ఈ వీడియోలో చిరంజీవి పాత్రను కూడా పరిచయం చేశారు మేకర్స్. కార్పెంటర్ గా మాత్రమే కాకుండా, ఆర్కిటెక్ట్ గానూ చిరంజీవి సినిమాలో ఉంటున్నారని అనిపిస్తోంది. గురుకులంలో చదువుకున్న విద్యార్థిగా రామ్ చరణ్ ‘సిద్ధ’ పాత్ర ను పోషించారు. ఈ నెల 23న ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో జరగనుంది.

బలమైన స్టోరితో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేయడంతో పర్ఫెక్ట్ జడ్జిమెంట్ తెలిసిన వ్యక్తిగా దర్శకులు కొరటాల శివకు పేరుంది. ఈ నేపథ్యంలో ‘ఆచార్య’ చిత్రం కోసం ఆయన చాలా కష్టపడి పెద్ద కథను రాసుకున్నారని ఇప్పటికే విడుదలైన ట్రైలర్ చూస్తుంటే స్పష్టమవుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version