ప్రముఖ గాయని.. భారతరత్న, పద్మ విభూషన్ లతా మంగేష్కర్ మరణించడం పట్ల దేశంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సంగత అభిమానులకు లతా మంగేష్కర్ మరణం తీరని లోటుని మిగిల్చింది.
లతా మంగేష్కర్ మరణంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. సంతాపాన్ని తెలియ జేశారు. నేను చెప్పలేని ఆవేదనలో ఉన్నానని.. లతా దీదీ మమ్మల్ని వదిలిపెట్టారని.. ఆమె మరణం దేశానికి తీరని శున్యాన్ని మిగిల్చిందని అని మోదీ అన్నారు. రాబోయే తరాలు భారతీయ సంస్కృతికి ధీటుగా ఆమెను గుర్తుంచుకుంటారని అన్నారు. లతా దీదీ పాటలు రకరకాల ఎమోషన్లను తీసుకోచ్చాయని.. ఆమె దశాబ్దాలుగా భారతీయ చలనచిత్ర ప్రపంచ మార్పులను దగ్గరగా చూసిందని అన్నారు. సినిమాలకు అతీతంగా, ఆమె భారతదేశ ఎదుగుదల పట్ల ఎప్పుడూ మక్కువ చూపేది. ఆమె ఎల్లప్పుడూ బలమైన మరియు అభివృద్ధి చెందిన భారతదేశాన్ని చూడాలని కోరుకుందని ప్రధాని మోదీ అన్నారు.
లతా దీదీ నుంచి నెను ఎప్పుడూ.. అపారమైన ప్రేమను పొందానని అది గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. లతా దీదీ మరణించినందుకు నా తోటి భారతీయులతో నేను బాధపడ్డాను. ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడి సానుభూతి తెలిపారు. ఓం శాంతి అంటూ ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు.