ఢిల్లీలో కాంగ్రెస్ నేతలపై పోలీసులు జులుం చూపించారు. ఏఐసిసి సంస్థాగత వ్యవహారాల ఇంచార్జ్ కే.సి. వేణుగోపాల్, రాజ్యసభ ఎమ్.పి పి.చిదంబరం, ఢిల్లీ కాంగ్రెస్ నేత అనిల్ భరద్వాజ్, లోకసభ ఎమ్.పి జ్యోతి మణి పై లాఠీ లు ఝుళిపించారు ఢిల్లీ పోలీసులు. పోలీసుల లాఠీ దెబ్బలకు రాజ్యసభ ఎమ్.పి ( రాజస్థాన్) ప్రమోద్ తివారి కి పక్కటెముకుల్లో ఫ్రాక్చర్ అయ్యాయి. ఢిల్లీ కాంగ్రెస్ వ్యవహారాల ఏఐసిసి ఇంచార్జ్ శక్తి సింగ్ గోహిల్ పై విచిక్షణా రహితంగా లాఠీలు ఝుళిపించారు పోలీసులు.
అయితే దీనిపై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ పార్టీ నేతలు. లోకసభ స్పీకరు ఓం బిర్లా కు పోలీసులు వ్యవహరించిన తీరును నివారించాం… పోలీసుల లాఠీ దెబ్బల వల్ల ఎమ్.పి లకు కలిగిన గాయాలను నివారించామన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.
ఉదయం నుంచి గంటల తరబడి , అర్ధరాత్ర వరకు పోలీసు స్టేషన్ల లో కాంగ్రెస్ నేతలను నిర్బంధించిన విషయాన్ని తెలిపామని..కనీసం ఆహారం, తాగేందుకు నీళ్లు కూడా ఇవ్వకుండా ఎమ్.పిల పట్ల చాలా అవమానకరంగా పోలీసులు వ్యవహరించారని వెల్లడించారు. హోమ్ మంత్రి అమిత్ షా, ప్రధాని మోడి ఆదేశాల మేరకే పోలీసులు అలా వ్సవహరించారు.అధికార బిజేపి నేర్పిన పాఠాలను తరిగి ఖచ్చితంగా ఒప్పచెపుతామని హెచ్చరించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.