లాంచ్‌ అయిన Nokia G11 plus.. స్పెసిఫికేషన్స్‌ ఇవే..!

-

నోకియా నుంచి జీ సిరీస్‌లో భాగంగా.. జీ11 ప్లస్‌ స్మార్ట్ ఫోన్‌ లాంచ్‌ అయింది. నోకియా జీ 11 తర్వాతి వర్షన్‌గా ఈ ఫోన్‌ లాంచ్‌ అయింది. ఇది ఒక బడ్జెట్‌ స్మార్ట్‌ ఫోన్‌.. ఈ ఫోన్‌ విశేషాలు ఇలా ఉన్నాయి..!

నోకియా జీ11 ప్లస్ స్పెసిఫికేషన్లు..

ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది.
ఇందులో 6.517 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు.
దీని యాస్పెక్ట్ రేషియో 20:9 కాగా, స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉంది. ప్రాసెసర్ వివరాలు తెలియరాలేదు.
4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌ను అందించారు.
స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 512 జీబీ వరకు పెంచుకోవచ్చు.
4జీ ఎల్టీఈ, వైఫై, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఎఫ్ఎం రేడియో, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ కూడా ఇందులో ఉన్నాయి.
యాక్సెలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్లు ఇందులో అందించారు.
ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ వెనక భాగంలో అందించారు.
ఈ స్మార్ట్ ఫోన్ మందం 0.85 సెంటీమీటర్లు కాగా… బరువు 192 గ్రాములుగా ఉంది.

కెమేరా క్వాలిటీ..

ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా… దీంతోపాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉంది. ఎల్ఈడీ ఫ్లాష్ కూడా ఈ స్మార్ట్‌ఫోన్‌లో అందించారు. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.

నోకియా జీ11 ప్లస్ ధర..

వాస్తవానికి ఈ ఫోన్ ధరను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. దీని ఫీచర్లు బట్టి చూస్తే రూ.15 వేలలోపే ధర ఉండే అవకాశం ఉంది.
ఇందులో 4జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది.
చార్‌కోల్ గ్రే, లేక్ బ్లూ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

 

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news