ఎల్ఐసీ సూపర్ పాలసీ..ఒక్క స్కీమ్ తో కుటుంబం మొత్తానికి భద్రత..

-

ప్రముఖ ప్రభుత్వ ఇన్సూరెన్స్ సంస్థ ఎప్పటికప్పుడు కొత్త పాలసీలను అందిస్తూ వస్తుంది.. అంతేకాదు కొన్ని పథకాలకు వడ్డీ రేట్లను కూడా పెంచుతూ వస్తుంది. ఎల్ఐసీ ప్రభుత్వ రంగ సంస్థ అవడంతో సొమ్ముకు పూర్తి భద్రత.. పెట్టిన పెట్టుబడికి తగిన రాబడి వస్తుండటంతో చాలా మంది ఇందులోని వివిధ పథకాలను ఎంచుకుంటున్నారు. అందుకే ఎల్ఐషీ ప్రతి వర్గాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని విభిన్నరకాల బీమా పాలసీలను తీసుకువస్తూనే ఉంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడిని అందించే పథకం గురించి తెలుసుకుందాం.

ఇందులో మీ కుటుంబం పెట్టుబడి పెట్టడం ద్వారా పొదుపు, భద్రత రెండింటికీ హామీని పొందుతారు. ఈ పాలసీ బీమా జ్యోతి ప్లాన్. ఈ పథకం నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, వ్యక్తిగత, జీవిత బీమా సేవింగ్స్ ప్లాన్.. దీని గురించి పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం..పెట్టుబడి పెట్టే వ్యక్తులు రూ.1,000పై ప్రతి సంవత్సరం రూ.50 భారీ రాబడిని పొందుతారు. దీనితో పాటు, పాలసీదారుడు పాలసీ పూర్తయ్యేలోపు మరణిస్తే, అటువంటి పరిస్థితిలో, అతని కుటుంబం మరణ ప్రయోజనం పొందుతుంది..

ఈ పథకం పూర్తి వివరాలు..

*. ఈ పథకంలో పెట్టుబడి పెడితే లక్ష వరకు ఆదాయాన్ని పొందవచ్చు..

*. 15 నుంచి 20 ఏళ్ల కాలానికి ఈ పాలసీలో పెట్టుబడి పెడుతున్నారు.

*. ఈ పాలసీలో, మీరు మొదటి 5 సంవత్సరాలు మాత్రమే పెట్టుబడి పెట్టాలి.

*. ఇందులో, పాలసీని కొనుగోలు చేయడానికి, మీ వయస్సు 90 రోజుల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉండాలి.

*. అదే సమయంలో, మీరు కనీసం 18 సంవత్సరాల నుండి 75 సంవత్సరాల మధ్య పాలసీ, మెచ్యూరిటీని పొందుతారు..

*. గరిష్ట పరిమితి అనేది లేదు..

ఇకపోతే మీరు ప్రతి నెల, మూడు నెలలు, 6 నెలలు, వార్షికంగా ఈ పాలసీలో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పాలసీలో నెలకు కనీసం రూ.5,000, వార్షిక ప్రాతిపదికన రూ.50,000 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఈ పాలసీని కొనుగోలు చేయడానికి మీరు సంస్థ బ్రాంచ్ కు వెళ్ళాలి.ఆన్లైన్లో కూడా పాలసీ పెట్టుబడి పెట్టవచ్చు..

 

Read more RELATED
Recommended to you

Latest news