ఈ LIC స్కీమ్ తో.. జీవితకాల పెన్షన్..!

-

చాలా మంది ఈ మధ్య కాలంలో ఎన్నో రకాల స్కీమ్స్ లో డబ్బులు పెడుతున్నారు. ఇలా స్కీమ్స్ లో డబ్బులు పెట్టడం వలన భవిష్యత్తు లో ఇబ్బందులు ఏమి లేకుండా ఉండచ్చు. పదవీ విరమణ తర్వాత మీ ఖర్చుల కోసం భయపడక్కర్లేదు. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నో రకాల స్కీమ్స్ ని అందిస్తోంది. ఈ స్కీమ్స్ వలన చాలా లాభాలు వున్నాయి.

పైగా ఎలాంటి రిస్క్ కూడా ఉండదు. . లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అందిస్తున్న స్కీమ్స్ లో న్యూ జీవన్ శాంతి యోజన కూడా ఒకటి. పదవీ విరమణ తర్వాత డబ్బులు రావాలంటే ఇందులో మీరు డబ్బులు పెట్టుకోవచ్చు. ఎల్ఐసీ కొత్త జీవన్ శాంతి పథకం తీసుకుంటే మీ పెన్షన్ మొత్తం ఫిక్స్ చేయబడుతుంది. ఈ పథకం లో డబ్బులు పెడితే ప్రతినెలా పెన్షన్ సౌకర్యం లభిస్తుంది. కొత్త జీవన్ శాంతి ప్లాన్ యాన్యుటీ రేట్లను కూడా పెంచారు.

ఈ ప్లాన్ సవరించిన వెర్షన్ జనవరి 5, 2023 నుంచి అమ్మకానికి అందుబాటులో వుంది. ఈ స్కీమ్ లో మీరు రెండు ఆప్షన్స్ ని ఎంపిక చేసుకోవచ్చు. మొదటి ఎంపిక సింగిల్ లైఫ్ కోసం వాయిదా వేసిన యాన్యుటీ. ఇంకొకటి ఉమ్మడి జీవితానికి వాయిదా వేసిన యాన్యుటీ. ఒంటరి జీవితానికి వాయిదా వేసిన యాన్యుటీలో. నామినీకి అతని ఖాతాలో డబ్బు ఇస్తారు. అదే జాయింట్ లైఫ్ కోసం వాయిదా వేసిన యాన్యుటీలో ఒకరు మరణిస్తే మరొకరికి పెన్షన్ వస్తుంది. అర్ధ-వార్షిక, త్రైమాసిక, నెలవారీగా డబ్బులు చెల్లిస్తారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version