మళ్లీ రెచ్చిపోతున్న లోన్‌ యాప్ ఏజెంట్లు.. మార్ఫింగ్‌ ఫోటోలతో బెదరింపులు

-

ఎలాంటి నిబంధనలు లేకుండా ఈజీగా లోన్స్‌ వస్తున్నాయని తొందరపడి లోన్ యాప్స్‌ ద్వారా తీసుకుంటే అవస్థలు పడాల్సి వస్తుంది. రోజురోజుకు లోన్‌ యాప్‌ ఏజెంట్లు రెచ్చిపోతున్నారు. లోన్‌ తీసుకుంది పురుషుడైనా.. స్త్రీఅయినా సంబంధం లేదు.. లోన్‌ తీసుకున్న సమయంలోని ఫోటోలోను మార్ఫింగ్‌ చేసి వారిని బెదరించి.. వారిని మానసిక క్షోభకు గురిచేస్తున్నారు. తాజాగా మరో ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. హైదరాబాద్‌కి చెందిన ఓ వ్యక్తి లోన్‌యాప్‌ ద్వారా నగదు తీసుకున్న తర్వాత… కిస్తీలన్నీ చెల్లించాడు. అయినా బకాయిపడిన మొత్తం చెల్లించకపోతే పరువుతీస్తామంటూ.. రుణ్‌యాప్‌ నిర్వాహకుల నుంచి కొన్ని సందేశాలు వచ్చాయి. దీంతో బాధితుడు సైబర్‌ క్రైం పోలీసులను కలిసి ఫిర్యాదు చేశారు. రుణం తీసుకున్న మరో యువకుడి ఫొటోను మార్ఫింగ్‌చేసి చరవాణికి పంపారు.

బకాయిపడిన మొత్తం చెల్లించకపోతే సామాజికమాధ్యమాల్లో పెడతామని బెదిరించడంతో మరోచోట అప్పతెచ్చి నిర్వాహకులకు వడ్డీతో సహా చెల్లించాడు. ఫతేనగర్‌లో ఓ వ్యాపారి వద్ద పనిచేస్తున్న యువకుడి వద్దకు వచ్చిన ముగ్గురు వ్యక్తులు రూ.60వేల రుణం వెంటనే చెల్లించకపోతే అరెస్టుచేస్తామని బెదిరించారు. అనంతరం అతడి ప్రతిష్ఠను కించపర్చేలా స్నేహితుల చరవాణులకు రుణ యాప్‌ నిర్వాహకులు అసభ్య సందేశాలు పంపారు. రుణయాప్ ఏజెంట్లే పోలీసుల రూపంలో వచ్చి బెదిరించినట్లు గుర్తించి.. సైబర్ క్రైం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. సాధ్యమైనంత వరకు రుణయాప్‌ల జోలికి వెళ్లకపోవడమే మంచిదని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్ సీవీ ఆనంద్‌ సూచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news