సీఎం జగన్‌కు నారా లోకేష్‌ బహిరంగ లేఖ

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర సీఎం జగన్ మోహన్‌ రెడ్డి కు తెలుగు దేశం పార్టీ యంగ్‌ లీడర్‌, మాజీ మంత్రి నారా లోకేష్ బహిరంగ లేఖ రాశారు. పోల‌వ‌రం నిర్వాసితుల‌ స‌మ‌స్య‌లు త‌క్ష‌ణ‌మే ప‌రిష్క‌రించి, వారి దీక్ష‌లు విర‌మింప‌జేయాలని ఈ లేఖలో నారా లోకేష్ స్పష్టం చేశారు. అంద‌రికీ చ‌ట్ట‌ప్ర‌కారం పున‌రావాసం క‌ల్పించాలని… ఆర్అండ్ఆర్‌ ప్యాకేజీ అంద‌రికీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు నారా లోకేష్‌.

సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి గ‌తం లో ప్ర‌క‌టించిన రూ. 10 ల‌క్ష‌ల ప్యాకేజీ అందించాలని డిమాండ్‌ చేశారు.
2013 భూసేక‌ర‌ణ చ‌ట్టం అమ‌లు చేయాలని… 18 ఏళ్లు నిండిన వారంద‌రికీ ప్యాకేజీ వ‌ర్తింప‌ జేయాలని లేఖ ద్వారా జగన్‌ మోహన్‌ రెడ్డిని డిమాండ్‌ చేశారు నారా లోకేష్‌.. నిర్వాసితుల‌కు కేటాయించిన కాల‌నీల్లో అన్ని సౌక‌ర్యాలు క‌ల్పించాలని.. గ్రామాల‌ను ఖాళీ చేయించిన తేదీనే క‌టాఫ్ తేదీ గా ప‌రిగ‌ణించాలని కోరారు నారా లోకేష్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version