Love Story movie Review: అక్కినేని నాగ చైతన్య- అందాల భామ సాయి పల్లవి జంటగా నటించిన ‘లవ్ స్టోరీ. ఈ చిత్రానికి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించగా.. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించగా..కె నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు ప్రొడ్యూసర్లుగా వ్యవహరించారు.
ముందుగా శేఖర్ కమ్ముల మూవీ అంటేనే.. ప్రేక్షకుల అంచనాలు ఓ రేంజ్‌లో ఉంటాయి. దానికి తోడు.. ఫిదా తరువాత.. శేఖర్‌కమ్ముల డైరెక్టర్‌లో సాయిపల్లవి మరోసారి నటించడంతో ఆ అంచనాలు మరింత పెరిగాయి. అలాగే.. ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్స్, ఫస్ట్ లూక్, పాటలు, బెస్ట్ ప్రమోషన్స్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. మొత్తానికి ఈ చిత్రం మొదటి నుంచే.. పాజివిట్ టాక్ ఉంది.
ఫీల్ గుడ్ డ్రామాగా తెరకెక్కిన చిత్రం లవ్ స్టోరీ….. శేఖర్ కమ్ముల తన కథలో తనదైన స్పెషల్ మార్క్‌ను చూపించే ప్రయత్నం చేస్తాడు. సోర్టీ విషయానికి వస్తే.. సామాజికంగా వెనుకబడిన వర్గానికి చెందిన అబ్బాయి రేవంత్(నాగ చైతన్య). తన కాళ్ల మీద తాను నిలబడాలి. ఉన్నతంగా ఎదగాలనే మనసత్వం హీరోది. ఈ క్రమంలో హైదరాబాద్‌కు వెళ్లి డ్యాన్స్ స్కూల్ రేవంత్ నడుపుతుంటాడు.
ఈ కథలో హీరోయిన్ మౌనిక (సాయి పల్లవి) అగ్రకులనికి చెందిన పెద్దింటి అమ్మాయి. బి టెక్ పూర్తి చేసి.. ఆమె కూడా ఉద్యోగం కోసం హైదరాబాద్ వస్తుంది. రేవంత్, మౌనికలది ఒకే ఊరు. కానీ వారిద్దరిది వేరువేరు కులాలు. అయితే.. వీరిద్దరూ కుల బేధాలు మరిచి ఎలా కలిశారు? వారి ఎలా ప్రేమలో పడుతారు.
వారి పెళ్లికి కులమతాలు అడ్డుగోడలుగా ఎలా నిలిచాయి? రేవంత్ ఎలాంటి వివక్షను అనుభవించాడు? సమాజంపై హీరో అభిప్రాయమేమిటి? పెళ్లి చేసుకొని దుబాయ్‌కి పారిపోవాలని ప్రయత్నించిన వారిద్దరూ ఎందుకు మార్చుకున్నారు? వారి ఊరిలో బాబాయ్( రాజీవ్ కనకలా) చేస్తున్న అకృత్యాలకు ఎలా అడ్డుకట్ట వేశారు? ఆయనకు ఎలాంటి గుణాపాఠం నేర్పేందుకు మౌనిక, రేవంత్ ప్రయత్నించారనే ఈ చిత్రా కథాంశం.
ఫస్టాఫ్లో రేవంత్ బాల్యం, నాడు గ్రామీణ ప్రాంతంలో ఉన్న అసమానతలు చూపించారు. హీరో రేవంత్ వెనుకబడి వర్గానికి చెందిన అబ్బాయి కావడంతో బాల్యంలో అనేక వివక్షను లోనవుతారు. ఆ సున్నిత సన్నీవేశాలను చాలా ఎమోషనల్‌గా తెరకెక్కించాడు శేఖర్ కమ్ముల. మౌనిక(సాయి పల్లవి) పెద్దింటి అమ్మాయి . అయినా తాను మానసికంగా ఎదురుకుంటున్న సంఘర్షణ చూపించే ప్రయత్నం చేశాడు. ఫస్టాఫ్‌లో డైరెక్టర్ ప్రేక్షకుల సహనానినకి కొంత పరీక్ష పెట్టినా.. ఎంటర్‌టైన్‌మెంట్, సోర్టీ ఎస్టాబిష్ చేయాడానికి ప్రయత్నించాడు.
ఇక రెండో భాగం విషయానికి వస్తే.. చివరి 30 నిమిషాలే సినిమాకు ప్రాణం. అసలు కథ అప్పుడే పరుగులు పెడుతుంది. కమర్షియల అంశాల కారణంగా రొటీన్ క్లైమాక్స్‌తో తన విజన్‌కు తెర వేశాడని ఫీలింగ్ కలుగుతుంది.
గ్రామీణ ప్రాంతాల్లో కులం, మత వివక్ష, మహిళలపై లైంగిక దాడులు లాంటి సున్నితమైన అంశాలతో కొత్తగా కథను చెప్పేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో సున్నితమైన విషయాలను బహిరంగంగా చెప్పకుండానే అంతర్గతంగా భావోద్వేగాలను జోడించి కథను చెప్పిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది.
నాగచైతన్య .. రేవంత్ పాత్రకు నూటికి నూరుపాళ్లు న్యాయం చేశారు. ఆ పాత్రలోకి దూరిపోయాడు. ఈ పాత్ర ద్వారా నవ్వించడమే కాకుండా.. చైతూ.. భావోద్వేగమైన పాత్రతో నటించి.. గుండెలను పిండేసే ఎమోషన్ పండి ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేస్తాడు. ఈ పాత్ర చైతూ.. కెరీర్ ది బెస్ట్ క్యారెక్టర్ అని చెప్పవచ్చు. నటనతోనే కాకుండా ఈ చిత్రంలో డ్యాన్స్ కూడా ఎస్మారైజ్ చేశారు.
న్యాచులర్ బ్యూటీ సాయి పల్లవి.. మౌనిక పాత్రలో కనిపించి మెప్పించింది. మరోసారి డ్యాన్సులతో ఇరగదీసింది. ఎమోషన్స్ సన్నీవేశాల్లో తన నటనతో రక్తికట్టించింది. గ్లామర్ పాత్రతో పాటు నటనకు మరోవైప డ్యాన్స్ కు స్కోప్ ఉండటంతో చాలా సునాయసంగా నటించి మెప్పించింది. మరోసారి సాయిపల్లవి నటనకు ఫిదా అవుతారంటే అతిశయోక్తి కాదనే చెప్పాలి.
ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో రాజీవ్‌కనకాల కనిపించారు. విలన్ షేడ్స్ ఉన్నఈ పాత్రలో అద్బుతంగా ఒదిగిపోయారు. మరో కీలక పాత్ర ఆనంద చక్రపాణి.. ఆయన సాయిపల్లవి తండ్రిగా నటించారు. తన నటనతో ఈ పాత్రను గుర్తుండిపోయే చేశారు. అలాగే ఈశ్వరీ భాయ్, దేవయాని పాత్రలు ఎమోషనల్‌గా
చిత్రీకరించారు. మరోసారి ఉత్తేజ్ నటనతో ఆకట్టుకున్నారు.
ఇక టెక్నికల్ విషయానికి వస్తే.. ఈ చిత్రానికి పాటలు, సంగీతం ఫ్లస్ పాయింట్ అనే చెప్పాలి. సంగీత దర్శకుడు పవన్ సీహెచ్ అద్బుతమైన సంగీతాన్ని అందించారు. రీరికార్డింగ్ కూడా ఈ చిత్రానికి బలాన్ని చేకుర్చింది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి మరో ఫస్ట్ పాయింట్. లవ్ స్టోరీ చిత్రానికి విజయ్ సీ కుమార్ సినిమాటోగ్రఫి చేశారు. నిజమాబాద్, ఆర్మూర్ పల్లె అందాలను అద్భుతంగా తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యాడు. ప్రతీ ఫ్రేమ్ ను చాలా క్యూట్ గా.. లవ్లీగా ఉండేలా తీర్చిదిద్దడంలో తన ప్రతిభను కనబరించారు.
ఇక మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటింగ్, అని మాస్టర్, శేఖర్ మాస్టర్ డ్యాన్సులు సినిమాకు మరో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. ఏషియన్ ఫిలింస్ లాంటి ప్రముఖ సంస్థ లవ్ స్టోరి మూవీకి సున్నితమైన, క్లిష్టమైన సబ్జెక్ట్‌ను ఎంచుకోవడమే సినిమా సక్సెస్‌కు కేరాఫ్ అడ్రస్ అయింది.
ఓవరాల్ గా లవ్ స్టోరి విషయానికి వస్తే.. సున్నితమైన, భావోద్వేగ భరితమైన సన్నివేశాలను తెరకెక్కించడంలో డైరెక్టర్ సక్సెక్ అయ్యాడనే చెప్పాలి. కానీ, సినిమా నిడివి ఎక్కువగా ఉండటం, అలాగే స్లో నేరేషన్ సినిమాకు కొంత ప్రతికూలంగా మారాయి. అయితే శేఖర్ కమ్ముల టేకింగ్, కథ చెప్పే విధానం ఆ లోపాలను సరిదిద్దాయని చెప్పవచ్చు. మరోవైపు..సాయిపల్లవి, నాగచైతన్యల మ్యాజిక్ ఫలించిందనే చెప్పాలి. కమర్షియల్ సినిమాలను ఆదరించే వారికి కాస్త ఇబ్బందిగానే ఉంటుంది.
నటీనటులు: సాయిపల్లవి, నాగచైతన్య, రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని, ఆనంద చక్రపాణి తదితరులు
కథ, దర్శకత్వం: శేఖర్ కమ్ముల
నిర్మాతలు: కే నారాయణదాస్ నారంగ్, పీ రామ్మోహన్ రావు
ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఐర్ల నాగేశ్వర్ రావు
కో ప్రొడ్యూసర్: భాస్కర్ కాటమశెట్టి
సినిమాటోగ్రఫి: విజయ్ సీ కుమార్
ఎడిటర్: మార్తాండ్ కే వెంకటేష్
మ్యూజిక్ డైరెక్టర్: పవన్ సీహెచ్