గుడ్ న్యూస్..ఒమిక్రాన్ నుంచి కోలుకున్న మ‌హ‌రాష్ట్ర వ్య‌క్తి

-

ద‌క్షిణా ఫ్రికాలో పురుడు పోసుకున్న ఒమిక్రాన్ వేరియంట్‌.. ఆ దేశంలో క‌ల్లోలం సృష్టిస్తోంది. ఆ దేశంలో రోజు రోజు కు కేసులు పెరుగుతుండ‌టం అంద‌రినీ క‌ల‌వ‌ర పెడుతోంది.  ప్రపంచ దేశాలను.. ఒమిక్రాన్  కొత్త వేరియంట్ గడగడలాడిస్తుంది.. ఇప్పటికే ఈ కొత్త వేరియంట్ 56 దేశాలకు పాకింది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనదేశంలోనూ ఈ వెరియంట్ 23 మందికి సోకింది. ఇలాంటి నేపథ్యంలో భారత దేశ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది మహారాష్ట్ర ప్రభుత్వం.

మహారాష్ట్రలో తొలిసారిగా… ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వ్యక్తికి నెగిటివ్ వచ్చిందని మహారాష్ట్రకు చెందిన అధికారులు తాజాగా ప్రకటించారు. నవంబర్ 24వ తేదీన దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన 37 ఏళ్ల మెకానికల్ ఇంజనీర్ తాజాగా జరిపిన పరీక్షల్లో.. నెగిటివ్ వచ్చిందని… ప్రస్తుతం అతన్ని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశామని కళ్యాణ్ మున్సిపల్ కమిషనర్ విజయ్ సూర్య వంశీ తెలిపారు. 7 రోజులు ఫోన్ క్వారంటైన్ లో ఉండాలని సూచించామని ఆయన స్పష్టం చేశారు కాగా మహారాష్ట్రలో ఇప్పటివరకు 10 కేసులు ఒమిక్రాన్ నమోదు అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version