Mahesh Babu : స్టైలీస్ లుక్ లో మహేష్ బాబు..ఫోటోలు వైరల్

-

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రజెంట్ ‘సర్కారు వారి పాట’ ఫిల్మ్ సక్సెస్ ను ఫారిన్ ట్రిప్ లో ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే మహేశ్ ..నెక్స్ట్ ఫిల్మ్ షూట్ విషయమై మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేశ్ మూడో చిత్రం చేయనున్నాడు.


‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత వీరిరువురి కాంబోలో వస్తున్న SSMB28పై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. ఈ చిత్రంలో మహేశ్ ద్విపాత్రాభినయం చేయనున్నాడని వార్తలు సోషల్ మీడియాలో వస్తన్నాయి. ఇందులో హీరోయిన్ గా త్రివిక్రమ్ ఆస్థాన నాయిక టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే నటిస్తోంది. ఈ పిక్చర్ లో భారీ యాక్షన్ సీన్స్ ను త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నారు.

అయితే.. తాజాగా స్టైలీస్ లుక్ లో మహేష్ బాబు కనిపించారు. రంగు రంగుల టీ షర్ట్‌ వేసుకుని.. చాలా హ్యండ్‌ సమ్‌ గా దర్శనం ఇచ్చారు ప్రిన్స్‌ మహేష్‌. OTTO అనే బ్రాండ్‌ ను ప్రొజెక్ట్‌ చేస్తూ.. ఈ ఫోటోలను షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news