త్రివిక్రమ్ మూవీ లో మహేష్ బాబు ద్విపాత్రాభినయం?

-

త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న మహేష్ బాబు 28 చిత్రాన్ని హారిక- హాసిని బ్యానర్ వారు నిర్మిస్తున్నారు. జూలై రెండవ వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాలనే ఆలోచనలో ఉన్నారు. ఆ దిశగానే అందుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. త్రివిక్రమ్- మహేష్ బాబు కాంబినేషన్ లో రూపొందుతున్న మూడవ సినిమా ఇది. అందువలన అభిమానులంతా ఆసక్తితో ఉన్నారు.

ఈ సినిమాలో మహేష్ బాబు ద్విపాత్రాభినయం చేయనున్నాడు అనేది తాజా సమాచారం. ఇప్పుడు ఇది అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచే అంశంగానే చెప్పాలి. గతాన్ని.. వర్తమానాన్ని కలిపి చూపిస్తూ ఈ కథ నడుస్తుంది. రామ్- లక్ష్మణ్ ఈ సినిమా కి స్టంట్ కొరియోగ్రాఫర్స్ గా ఉన్నారు. పూజా హెగ్డే కథానాయికగా అలరించనున్న ఈ సినిమాలో, ప్రతినాయకుడిగా తారకరత్న కనిపించనున్నాడు. ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి విడుదల చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version