‘మేజర్’ చూసి కన్నీటి పర్యంతమైన ప్రేక్షకులు..అడివి శేష్ భావోద్వేగం

-

యంగ్ హీరో అడివి శేష్ హీరోగా తెరకెక్కిన ప్రెస్టీజియస్ మూవీ ‘‘మేజర్’’. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రొడ్యూస్ చేసిన ఈ ఫిల్మ్ వచ్చే నెల 3న విడుదల కానుంది. ఈ క్రమంలోనే విడుదలకు ముందే థియేటర్లలో ప్రివ్యూ వేశారు మేకర్స్.

జైపూర్ లో ఈ సినిమా చూసిన సీని ప్రేక్షకులు కన్నీటి పర్యంతమయ్యారు. ‘‘మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్’’ అమర్ రహే అని నినాదాలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా, అది అడివి శేష్ దృష్టికి వచ్చింది.

ఇక ఈ వీడియో చూసి తాను భావోద్వేగానికి గురయ్యానని, ఇంతకు మించి తనకు ఏమీ అక్కర్లేదని అడివి శేష్ తెలిపారు. శశి కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కానుంది. ఇక ఇప్పటికే ప్రమోషన్స్ కార్యక్రమాల్లో పాల్గొన్న మూవీ యూనిట్ సభ్యులు..విడుదల ముందు రోజు వరకూ చిత్రాన్ని ప్రమోట్ చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version