బ్యూటిఫుల్ హీరోయిన్ మాళవిక మోహనన్ మోడల్ గా తన కెరీర్ స్టార్ట్ చేసింది. ప్రజెంట్ సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా దూసుకుపోతున్నది. తమిళ్, మలయాళ భాషల చిత్రాల్లో కథానాయికగా నటిస్తున్న ఈ భామ తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితమే. తలపతి విజయ్ నటించిన ‘మాస్టర్’ సినిమా తెలుగులోనూ విడుదల కాగా, అందులో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేసింది మాళవిక.
‘చారులత’గా ‘మాస్టర్’ సినిమాలో ఆకట్టుకున్న మాళవిక మోహనన్..ప్రజెంట్ ‘యుధ్ర’ అనే హిందీ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. ఈ భామ నటించిన ‘మారన్’ సినిమా తెలుగులోనూ విడుదలయింది. ఈ సంగతులు పక్కనబెడితే..మాళవిక మోహనన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటో స్ షేర్ చేస్తుంటుంది.
ఇటీవల ఈ భామ చీర కట్టులో దిగిన ఫొటోలు షేర్ చేయగా, అవి నెట్టింట బాగా వైరలయ్యాయి. తాజాగా ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఎత్తైన ప్రదేశంలో ఒంటరిగా దిగిన ఫొటోలు షేర్ చేసింది. అవి చూసి నెటిజన్లు ఈ హీరోయిన్ కు ఏమైందని చర్చించుకుంటున్నారు. ఎత్తైన బిల్డింగ్ దగ్గరలో ఉన్న ఓ గోడపైన కూర్చొని ట్రెండీ వేర్ లో అలా చక్కగా నవ్వుతు కనబడుతోంది మాళవిక మోహనన్.
ట్రెండీ బ్లూ కలర్ టాప్ , మ్యాచింగ్ జీన్స్ , షూస్ ధరించి అలా చూపులతోనే ఆకట్టుకుంటోంది మాళవిక. ఈ ఫొటోలను చూసి బాలీవుడ్ సెలబ్రిటీ ఫాతిమా సనా షేక్ లైక్ చేయగా, కొందరు నెటిజన్లు ‘ఫెంటాస్టిక్, యూ లుక్ సో నైస్, సో క్యూట్, బ్యూటిఫుల్’ అని కామెంట్స్ చేస్తున్నారు.