తెలుగు ప్రేక్షకులకు పరిచయమే అవసరం లేని నటి మంచు లక్ష్మీ. మంచు లక్ష్మీ నటిగానే కాదు.. యాంకర్, నిర్మాతగానూ రాణిస్తున్నారు. తొలి రోజుల్లో ఆమె కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు కుమార్తెగా పరిచయమైనప్పటికీ అనతికాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. యాంకర్‌గా ఆమె మాట్లాడే మాటలు ఎంతగానో ఫేమస్.
అడపాదడపా సినిమాలు చేస్తూ ఉన్న మంచు లక్ష్మీ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లోనూ సందడి చేస్తుతంది. అయితే, తాజాగా మంచు లక్ష్మి తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. నా జీవితంలో కొన్ని తప్పులు చేశాను. అవి ఇప్పుడు మార్చలేను. కానీ ఇప్పుడు నేను మారిపోయాను. కాబట్టి మళ్ళీ ఆ తప్పులు చేయను అంటూ ఇన్ స్టా స్టోరీలో రాసుకొచ్చింది. అయితే ఏ విషయంలో మంచు లక్ష్మి తప్పు చేసింది అన్నది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.