రాజకీయాలోకి వచ్చే ఆలోచన లేదు – మంచు మనోజ్

-

రాజకీయాలోకి వచ్చే ఆలోచన లేదని తెలిపారు మంచు మనోజ్. గత కొద్ది రోజులుగా ప్రేమించుకుంటున్న మంచు మనోజ్ – మౌనిక రెడ్డి ఎట్టకేలకు రూమర్లకు తెరదించుతూ మొన్న రాత్రి ఫిలింనగర్ లో 8:30గంటల సమయంలో మంచు లక్ష్మి నివాసంలో వివాహ బంధంతో ఒక్కటి అయ్యారు.అయితే ఈ పెళ్లి మంచు మోహన్ బాబుకు ఇష్టం లేదని.. అందుకే మంచు మనోజ్ కుటుంబానికి దూరంగా ఉంటున్నారు అంటూ ప్రచారం జరిగింది.

కానీ ఆ ప్రచారానికి బ్రేకులు వేస్తూ మోహన్ బాబు దంపతులు మంచు మనోజ్ – మౌనిక రెడ్డి పెళ్లిలో సందడి చేశారు. అయితే, ఈ జంట ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ఈ సందర్భంగా మంచు మనోజ్ మాట్లాడుతూ, రాజకీయాలోకి వచ్చే ఆలోచన లేదు…ప్రజా సేవ చెయ్యాలన్న కోరిక ఉందని తెలిపారు. మౌనిక రాజకీయాలోకి వెళ్తే మద్దత్తు ఇస్తాను.. ప్రేమ ఎప్పుడు గెలవాలి…నా విషయంలో అది నిజమైందని వివరించారు. 12 సంవత్సరాలుగా ప్రేమలో వున్నాను….6 సంవత్సరాలు కష్టాలు అనుభవించానని తెలిపారు. ఎక్కడ ఆగానో ….తిరిగి అక్కడ నుంచే మొదలు పెడుతున్నా….త్వరలోనే సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version