మ్యాంగో కుల్ఫీ.. మూడే వస్తువులతో ఇంట్లోనే తయారు చేసుకోండిలా..

-

వేసవి వచ్చిందంటే ఐస్ క్రీములు ఎక్కువగా తింటారు. మండే వేడికి చల్లగా తినాలన్న కోరిక ఎక్కువగా ఉంటుంది కాబట్టి, దానికోసం ఐస్ క్రీమ్ బెస్ట్ ఆప్షన్ అనుకుని రకరకాల వెరైటీలు టేస్ట్ చేస్తారు. ఐస్ క్రీములతో పాటు చాలా మందికి నచ్చే మరొక అద్భుతమైన చల్లని వెరైటీ కుల్ఫీ.. అవును, చిన్నప్పుడు కుల్ఫీ ఎప్పుడు తిందామా? ఊర్లలోకి కుల్ఫీ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసేవారు. కుల్ఫీ బండీ రాగానే రుచిగా ఉండే మలై కుల్ఫీ కొనుక్కుంటుండేవారు. ఇప్పుడు రకరకాల కుల్ఫీలు వచ్చేసాయి. అందులో మ్యాంగో కుల్ఫీ కూడా ఒకటి.

ఐతే ఈ మ్యాంగీ కుల్ఫీని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చని మీకు తెలుసా? అవును, వేసవిలో ఖచ్చితంగా తినాల్సిన మామిడి పండు కుల్ఫీ తయారీ గురించి ఈరోజు తెలుసుకుందాం.

ముందుగా కుల్ఫీ తయారు చేయడం చాలా కష్టం, అది మనవల్ల కాదు, ఇంట్లో అస్సలే చేయలేం అనే మాటలు వదిలేయండి. ఎవరైనా చెప్పినా కూడా నమ్మకండి. మీకు కావాల్సినట్టుగా మ్యాంగో కుల్ఫీ తయారు చేసుకుని అందమైన అనుభూతిని పొందండి.

మ్యాంగీ కుల్ఫీ తయారీఖి కావాల్సిన పదార్థాలు

గడ్డకట్టిన పాలు, క్రీమ్
మామిడి రసం
అంతే..

తయారీ విధానం

ఒక పాత్రలో గడ్డకట్టిన పాలు, క్రీమ్ తీసుకుని మామిడి రసాన్ని కలపాలి. ఈ మూడూ బాగా మిక్స్ అయ్యేలా కవ్వంతో బాగా కలపాలి.

మీకు కావాలనుకుంటే దానికి ఏదైనా గింజలను కలుపుకోవచ్చు. మధ్య మధ్యలో పంటికింద తగలడానికి వేటినైనా కలుపుకోవచ్చు.

అల్యూమినియం కవర్ ని కుల్ఫీ లాగా చేసుకుని పట్టుకోవడానికి కావాల్సిన స్టిక్ ని దానికి అంటించాలి.

ఒక రోజంతా రిఫ్రిజిరేటర్ లో ఉంచాలి. తెల్లారి చూస్తే మీకు కావాల్సిన కుల్ఫీ తయారుగా ఉంటుంది. వేసవిలో రుచి చూడాల్సిన మామిడిని కుల్ఫీ టేస్టుతో కలిపి చూస్తే ఆ గమ్మత్తే వేరు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version