పురపాలక శాఖను దళితుకుల ఇచ్చే ధైర్యం ఉందా..? – టీ కాంగ్రెస్ ఇంఛార్జ్

-

కాంగ్రెస్ , టీఆర్ఎస్ పై విమర్శల డోస్ పెంచింది. ఇప్పటికే పీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ, ప్రభుత్వాన్నివిమర్శిస్తున్నారు. సీఎం కేసీఆర్ నేరుగా ప్రశ్నిస్తున్నారు.  తాజాగా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మానిక్కం ఠాగూర్ టీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించారు. కేసీఆర్, కేటీఆర్లను టార్గెట్ చేసుకుంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ నిర్వహిస్తున్న పురపాలక శాఖను దళితులకు ఇచ్చే ధైర్యం ఉందా..?  అని సవాల్ చేశారు. 2023 ఎన్నికల తర్వాత దళితున్ని సీఎం చేస్తా అని చెప్పే ధైర్యం ఉందా.. ? అని ప్రశ్నించారు. సీఎం ప్రతీ పనిలో 20 శాతం కమీషన్ తీసుకుంటున్నారని సంచలన కామెంట్స్ చేశారు. దళితుల పట్ల సీఎం కేసీఆర్ వివక్ష చూపిస్తున్నారని, ఆయన ఆధునిక మనువాది అని తీవ్రస్థాయిలో విమర్శించారు. ప్రతిపక్ష నేతలుగా ఉన్నదళితులను చూడలేకపోతున్నారని అన్నారు. హుజూరాబాద్ ఎన్నికలు దగ్గర పడుతున్నవేళ టీఆర్ఎస్ కు ప్రతిపక్షాలకు మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇవి ఏపార్టీకి ప్లస్ అవుతుందో అనేది వేచి చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version