మరాఠా ఆటో డ్రైవర్ స్టెపులు అదుర్స్..!

-

సోషల్ మీడియా ఎప్పుడు ఎదోఒక్క వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. తాజాగా ఓ వ్యక్తి వేసిన డాన్స్ ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని పూణెలో రెండు రోజుల క్రితం, బాబా కాంబ్లేతో పాటు అతడి తోటి డ్రైవర్లు మాలెగావ్‌లోని ఓ పెట్రోల్ పంపుకు పెట్రోల్ కొట్టించుకోవడానికి వచ్చారు. అయితే వారు వచ్చే సమయానికి విద్యుత్ లేనందున మూడు గంటల పాటు వెయిట్ చేయాల్సి వచ్చింది.

dance

అయితే ఈ సమయంలో వారు పక్కన ఉన్న ఓ పార్కులో గుంపుగా మాట్లాడుకుంటున్నారు. ఇంతలో ఏం చేయాలో తెలియక బాబా కాంబ్లే డ్యాన్స్ ప్రారంభించాడు. దీంతో తోటి డ్రైవర్లు సహకారం అందించడంతో చాల చక్కగా డ్యాన్స్ చేశాడు. ఇంతలో అక్కడున్న వారందరు అతడి డ్యాన్స్ ను ఎగబడి చూశారు. తమ సెల్‌ ఫోన్‌లలో వీడియో తీసుకున్నారు. దీంతో ఆ వీడియో దేశ వ్యాప్తంగా వైరల్ అవుతోంది. ఈ విషయం ఆ నోటా ఈ నోటా బాబా కాంబ్లేకు చేరింది. దీంతో ఆ వీడియో చూసిన కాంబ్లే మురిసిపోయాడు. అంతేకాకుండా ఇంత పెద్ద మొత్తంలో వ్యూస్ వస్తాయని ఊహించలేదన్నాడు.

అంతేకాకుండా.. అతడి డ్యాన్స్ చూసిన సెలబ్రిటీలు అతడికి ఫోన్ చేసి అభినందిస్తున్నారు. దీంతో అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. బారామతి తాలూకాలోని గున్వాడిలో నివసించే బాబా కాంబ్లే గ్రామ పంచాయతీ సభ్యుడు. ఇక చిన్నప్పటి నుంచీ డ్యాన్స్‌ను ఇష్టంగా చేస్తున్నాడు. వివిధ నృత్య రూపాలను నేర్చుకున్నాడు. కానీ సరైన అవకాశాలు లేక ఆటోనడుపుతూ జీవనం గడుపతున్నాడు. ఒక్క రాత్రిలో ఈ వీడియో హల్ చల్ చేయడంతో ఇప్పడు బాబా కాంబ్లేను ఎక్కడికి వెళ్లినా అందరు గుర్తుపడుతున్నారు. ఏదైనా అవకాశం ఇస్తే మరింత డ్యాన్స్ చేసి చూపిస్తానని ఈ సందర్భంగా తన మనసులో మాట చెప్పాడు బాబా కాంబ్లే.

Read more RELATED
Recommended to you

Exit mobile version