సుప్రీంకోర్టు ఆవరణలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఢిల్లీలోని తిలక్ మార్గ్ దగ్గరున్న యూకో బ్యాంకులో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన సిబ్బంది.. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఈ మేరకు ఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ సిబ్బంది.. ఆరు ఫైర్ టెండర్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ మేరకు బ్యాంకును మూసివేశారు.
ఈ బ్యాంక్ సుప్రీంకోర్టు ఆవరణలోని తిలక్ మార్గ్ లో ఉంది. అగ్నిమాపక సిబ్బంది గంటల వ్యవధిలోనే మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే అగ్ని ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై అధికారులు విచారణ జరుపుతున్నారు. బ్యాంకులో షార్ట్ సర్య్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, బ్యాంకుకు సంబంధించిన డాక్యుమెంట్లు, ఫర్నీచర్లు ధ్వంసం అయినట్లు పేర్కొన్నారు.