మెదక్ కారులో రచ్చ..మైనంపల్లి ఎంట్రీతో చిక్కులు!

-

బీఆర్ఎస్ పార్టీకి ఉన్న కంచుకోటల్లో మెదక్ అసెంబ్లీ కూడా ఒకటి. ఈ స్థానంలో బి‌ఆర్‌ఎస్ పార్టీ చాలా స్ట్రాంగ్ గా ఉంది. అంతకముందు ఇది టి‌డి‌పికి కంచుకోటగా ఉండేది. 1985, 1994, 1999, 2009 ఎన్నికల్లో ఇక్కడ టి‌డి‌పి గెలిచింది. తర్వాత తెలంగాణ ఆవిర్భావంతో బి‌ఆర్‌ఎస్ హవా నడుస్తోంది. బి‌ఆర్‌ఎస్ నుంచి వరుసగా రెండుసార్లు పద్మా దేవేందర్ రెడ్డి గెలుస్తూ వస్తున్నారు. మూడోసారి కూడా పోటీ చేసి గెలవాలని ఆమె ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఆమె ప్రయత్నాలకు ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి చెక్ పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.

దీంతో మెదక్ లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఎవరికి వారు సెపరేట్ గా కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే ఇక్కడ ప్రతిపక్ష పార్టీలు వీక్ గా ఉండటం వల్ల బి‌ఆర్‌ఎస్ తరుపున ఎవరు పోటీ చేసిన గెలవడం ఈజీ. అందుకే ఈ సీటు కోసం నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే క్రమంలో మెదక్ రాజకీయాల్లోకి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఎంట్రీ ఇచ్చారు. మల్కాజిగిరి ఎమ్మెల్యేగా ఉన్న మైనంపల్లి..టి‌డి‌పి ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన విషయం తెలిసిందే.

మైనంపల్లి ట్రస్టు ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తూ..టి‌డి‌పిలోకి వచ్చి 2009లో మెదక్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. 2014లో మల్కాజిగిరి ఎమ్మెల్యే సీటు ఆశించారు..కానీ చంద్రబాబు ఇవ్వలేదు. దీంతో మైనంపల్లి బి‌ఆర్‌ఎస్ లో చేరి మల్కాజిగిరి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 2018 ఎన్నికల్లో మల్కాజిగిరి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక అక్కడ రాజకీయం చేస్తూనే..తాజాగా మెదక్ లో ఎంట్రీ ఇచ్చారు. అది కూడా తన వారసుడు రోహిత్‌కు సీటు ఇప్పించడానికి చూస్తున్నారు.

ఈ క్రమంలోనే మెదక్ లో సేవా కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఇప్పటికే అక్కడ రచ్చ నడుస్తోంది. మైనంపల్లి వారసుడు ఎంట్రీతో మరింత రచ్చ పెరిగింది. చివరికి మెదక్ సీటు ఎవరికి దక్కుతుందో చూడాలి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version