మెగా కార్నివాల్ : ఫ్యాన్స్ మధ్య చిరంజీవి బర్త్ డే వేడుకలు

-

మెగా ఫ్యాన్స్ కు మెగా బ్రదర్ నాగబాబు ఓ గుడ్ న్యూస్ చెప్పారు. చిరంజీవి పుట్టిన రోజున ఆయన ఫ్యాన్స్ కు సూపర్ గిఫ్ట్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రతి మెగా అభిమాని జీవితాంతం గుర్తుపెట్టుకునే విధంగా ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలను నిర్వహిస్తున్నట్లు మెగా బ్రదర్ నాగబాబు తెలిపారు. దేశంలో ఏ హీరోకు చేయని విధంగా లక్షలాది అభిమానులతో ఆగస్టు 22న హైదరాబాద్​లోని హైటెక్స్ వేదికగా మెగా కార్నివాల్ జరుపుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్నివాల్​కు ప్రతి మారుమూల పల్లెల్లో ఉన్న మెగా అభిమానులంతా హాజరుకావచ్చని నాగబాబు కోరారు.

ఈ వేడుకల్లో మెగా హీరోలంతా పాల్గొని అభిమానులను అలరిస్తారని నాగబాబు తెలిపారు. చిరంజీవి పుట్టినరోజు వేడుకంటే తమ కుటుంబంలో అతి పెద్ద పండగగా పేర్కొన్న నాగబాబు.. మా పండుగను ప్రతి అభిమానితో జరుపుకుంటామన్నారు. ఈ మేరకు హైదరాబాద్​లోని చిరంజీవి రక్తనిధి కేంద్రంలో పలువురు మెగా అభిమానుల సమక్షంలో చిరంజీవి పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన పోస్టర్​ను నాగబాబు ఆవిష్కరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version