ఆ యంగ్ హీరోకు అంత కక్కుర్తి ఎందుకు..!

-

ఈ లోకంలో డబ్బుకు ఉన్న ప్రాధాన్యత వేరే దీనికి లేదు.డబ్బుంటే చాలు అన్ని రకాల పనులు చిటికెలో పూర్తి అవుతాయి. విచిత్రంగా పేద వారిలో కంటే బాగా డబ్బులు ఉన్న వారికే డబ్బు మీద ఎక్కువ ఆశ ఉంటుంది. ఇక సినిమా ప్రపంచంలో డబ్బు అన్నింటినీ డిసైడ్ చేస్తుంది.

ఇక్కడ ప్రధానంగా హీరో ముఖం చూసి, డైరెక్టర్ ముఖం చూసి సినిమా స్టార్ట్ చేస్తారు. వారిని ముందే బుట్టలో వేసుకునేందుకు  అడ్వాన్స్ ఇచ్చి వేరే వైపు వెళ్లకుండా చూసుకుంటారు. ఇక ఇదే సందని వీళ్ల కోరికల చిట్టా బయటకి తీస్తారు. తనతో బాగా క్లోజ్ గా వుండే హీరోయిన్ కావాలని, మంచి మ్యూజిక్ డైరెక్టర్ కావాలని, సినిమా రిచ్ గా తీయాలని ఇలా వుంటాయి హీరో గారి కోరికలు. ఇక డైరెక్టర్ మంచి పేరున్న నటీ నటులు కావాలని, సూపర్ లోకేషన్స్ కావాలని గోల పెడతారు.

దీనితో బడ్జెట్ పెరిగే అవకాశం ఉందని ఆ నిర్మాత సినిమా ఆపేసి అడ్వాన్స్ వెనక్కి అడుగుతాడు. కొంత మంది అడగగానే ఈ గోల ఎందుకని వెంటనే ఇస్తారు. మరి కొంత మంది అస్సలే ఇవ్వరు. ఇప్పుడు ఒక మెగా హీరో  పాతిక లక్షల అడ్వాన్స్ వెనక్కు ఇవ్వకుండా, సినిమా తీయక పోతే అది నీ ప్రాబ్లం కాని నాది కాదు అని డబ్బులు ఇవ్వనని నిర్మాత ని పొమ్మన్నాడట. దీనితో అసలే అప్పుల్లో వున్న నిర్మాత కు ఏమి చేయాలో అర్థం కావడం లేదట. ఇక ఫైనల్ గా మెగాస్టార్ ను కలవాలని నిర్ణయించు కున్నాడట.

Read more RELATED
Recommended to you

Exit mobile version