ఇండస్ట్రీ వదిలి వెళ్లాలనుకున్న హీరో శ్రీకాంత్‌కు చిరంజీవి చెప్పిన మాటలివే.. !!

-

సినిమా ఇండస్ట్రీలో ‘స్వయం కృషి’తో ఎదిగిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. ప్రతిభతో పాటు నిజాయితీగా కష్టపడితే చాలు అనుకున్న స్థానానికి వెళ్లవచ్చు అని నిరూపించిన చిరంజీవి ఎంతో మందికి స్ఫూర్తిప్రదాత. సినీ ఇండస్ట్రీకి రావాలనుకునే వారితో పాటు ఉన్న వారిలో చాలా మంది తమకు స్ఫూర్తి ప్రదాత చిరంజీవి అని చెప్తుంటారు.

టాలీవుడ్ సీనియర్ హీరో మేక శ్రీకాంత్, ఉత్తేజ్ తదితరులు చిరంజీవి వీరాభిమానులు. ఇక ఒకానొక టైమ్ లో శ్రీకాంత్ మేక హీరోగా నటించిన సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ అవుతున్నాయి. దాంతో శ్రీకాంత్ ఇక ఇండస్ట్రీని వదిలేయాలనుకుని ఫిక్స్ అయిపోయారు. ఎవరినీ కలవడం లేదు. ఆ సమయంలో శ్రీకాంత్ మేకను తన వద్దకు పిలిపించుకున్నారు మెగాస్టార్ చిరంజీవి.

జయాపజయాలు అనేవి మన చేతిలో ఉండబోవని, మన ప్రయత్నం సరిగా ఉంటే చాలు..నువ్వు సినిమాలు చేయాల్సిందే అని హీరో శ్రీకాంత్ కు చెప్పి అండగా నిలిచారు మెగాస్టార్ చిరంజీవి. అలా చిరంజీవి చెప్పిన మాటలు విని శ్రీకాంత్ సినిమా ఇండస్ట్రీలోనే కొనసాగుతున్నారు. ఇప్పటికీ ఓ వైపున హీరోగా పలు సినిమాలు చేస్తూనే మరో వైపున కొన్ని సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు శ్రీకాంత్ మేక.

చిరంజీవి ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’, ‘శంకర్ దాదా జిందాబాద్’ చిత్రాల్లో చిరంజీవి రైట్ హ్యాండ్ ‘ఏటీఎం’గా శ్రీకాంత్ మేక నటించాడు. అలా శ్రీకాంత్ కు చక్కటి పేరు వచ్చింది. చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాల షూటింగ్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. విజయ దశమి కానుకగా ఆయన నటించిన ‘గాడ్ ఫాదర్’ రిలీజ్ కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news