‘ఆపరేషన్ వాలెంటైన్’ ప్రీరిలీజ్ ఈవెంట్ చీఫ్ గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి

-

కొత్త దర్శకుడు శక్తి ప్రతాప్ దర్శకత్వంలో  మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’.ఈ చిత్రంలో మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్ హీరోయిన్ గా నటిస్తున్నారు.వరుణ్ కెరియర్ లో మొట్టమొదటి హిందీ ప్రాజెక్ట్ గా వస్తున్న ఆపరేషన్ వాలెంటైన్ మార్చి 1న తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ వేగాన్ని పెంచారు.ఇక ఈ మూవీ ప్రీరిలీజ్ వేడుక రేపు హైదరాబాద్ లోని JRC కన్వెన్షన్లో జరగనుంది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా రానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. పద్మ విభూషణ్ అవార్డు పొందిన తర్వాత చిరంజీవి హాజరవుతున్న ఫస్ట్ ప్రీరిలీజ్ వేడుక ఇదే.

 

ఈ చిత్రానికి ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్  మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వరుణ్, మానుషీ జెట్ ఫైటర్స్ గా కనిపించబోతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version